Liquor Scam : లిక్క‌ర్ స్కామ్ పై `స్ట్రింగ్ ఆప‌రేష‌న్` సంచ‌ల‌నం

ఢిల్లీ ప్ర‌భుత్వం చేసిన లిక్క‌ర్ స్కామ్ ను నిరూపించేలా బీజేపీ స్టింగ్ ఆప‌రేష‌న్ చేసింది. ఆ వీడియోను సోమ‌వారం ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా విడుద‌ల చేశారు.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 04:13 PM IST

ఢిల్లీ ప్ర‌భుత్వం చేసిన లిక్క‌ర్ స్కామ్ ను నిరూపించేలా బీజేపీ స్టింగ్ ఆప‌రేష‌న్ చేసింది. ఆ వీడియోను సోమ‌వారం ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా విడుద‌ల చేశారు. “ఢిల్లీ ప్రభుత్వం ఎలా అవినీతికి పాల్పడుతుందో” తెలియ‌చేసేందుకు ఈ వీడియో నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ద‌ర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం కమీషన్ తీసుకున్నట్లు మద్యం కేసులో నిందితుడు అంగీకరించాడ‌ని గుర్తుచేశారు.

స్టింగ్ ఆపరేషన్’ టేప్‌లో ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న కుల్విందర్ మార్వా ఉన్నారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీలకు కేజ్రీవాల్ ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చిందని స్టింగ్ ఆపరేషన్ వీడియో ఆరోపించింది.ఈ విషయాలన్నీ మార్వా స్వయంగా అంగీకరించాడని బీజేపీ నేత తెలిపారు. ఒక రూపాయ‌లో కేవలం 20 పైసల విలువైన వస్తువు ఉందని, మిగిలిన 80 పైసల లాభం ఢిల్లీ ప్రభుత్వానికి వెళ్తుందని మార్వా వీడియోలో చెప్పడం వినవచ్చు. `మీకు కావాల్సినన్ని షాపులు పెట్టుకోండి అంటూ రూ.253 కోట్లు తీసుకున్నారు’’ అని మార్వా మాట్లాడుతూ ‘‘ఢిల్లీ ప్రభుత్వం ధనవంతుల నుంచి రూ.500 కోట్లు తీసుకుంటోంది. వారు బ్లాక్‌లిస్ట్ చేయబడిన కంపెనీలకు కూడా టెండర్లు ఇచ్చారు” అని మార్వా చెప్పారు.

“అరవింద్ కేజ్రీవాల్ మరియు సిసోడియా తమ స్నేహితుల జేబుల్లో 80 శాతం లాభాన్ని పెట్టారు. మీ దుకాణాన్ని వీడియో తీసి, దానికి ఎంత కమీషన్ ఇచ్చారో, సీబీఐకి వెళ్లాలని బీజేపీ మిమ్మల్ని కోరుతోంది’’ అని పాత్రా పిలుపునిచ్చారు. “భయపడకండి మనీష్ సిసోడియా జీ, ఇప్పుడు మీకు ఎస్కేప్ రూట్ లేదు” అని స్టింగ్ ఆపరేషన్ వీడియోను పాత్రా ప్లే చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది,