BJP Victory in Gujarat: గుజరాత్ గడ్డ.. బీజేపీ అడ్డా.. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్!

గుజరాత్ లో తమకు తిరుగులేదని నిరూపించింది బీజేపీ. వరుసగా ఏడోసారి అధికారం దక్కించుకొని రికార్డులు తిరుగరాసింది.

  • Written By:
  • Updated On - December 8, 2022 / 02:26 PM IST

తాజాగా వెలువడిన గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 92 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్‌ను క్రాస్‌ చేసిన బీజేపీ.. 152కి పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ.. సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ రిజల్ట్‌తో గుజరాత్ (Gujarat) లో తమకు తిరుగులేదని.. ఎన్నికలేవైనా సరే.. కాషాయ జెండా ఎగురవేయాల్సిందేనని బీజేపీ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ లో182 స్థానాలకు పోటీ జరుగుతుండగా152 స్థానాల్లో బీజేపీ (BJP) ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ 20కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా, ఆప్ 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

గుజరాత్ కొత్త సీఎం ప్రమాణం

గుజరాత్‌ (Gujarat) లో బీజేపీ (BJP) ఘన విజయంతో సీఎంగా అధికారం చేపట్టనున్నారు భూపేంద్ర పటేల్‌. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు. కాగా, రాష్ట్రంలో ఈ నెల 11 లేదా 12 కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని సమాచారం.

భారీ మెజార్టీతో గెలుపొందిన జడేజా సతీమణి
గుజరాత్‌ జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 31 వేలకుపైగా భారీ మెజార్టీ సాధించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ఆమె వెనుకంజలో ఉన్న విషయం తెలిసింది.

PARTY               LEADS + WIN

BJP                           158
CONG                     20

AAP                          5
OTH                         3

Also Read: Telangana Congress: ప్రక్షాళనలో టీకాంగ్రెస్.. ఠాగూర్ ఔట్, రేవంత్ దూకుడుకు చెక్!