Site icon HashtagU Telugu

Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నడ్డా

Karnataka Elections:

New Web Story Copy (58)

Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను ఈ రోజు విడుదల చేసింది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం బీజేపీ మేనిఫెస్టోలో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని పార్టీ ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టో ‘విజన్ డాక్యుమెంట్’ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు బెంగళూరులో విడుదల చేశారు. మేనిఫెస్టోను విడుదల చేస్తూ నడ్డా మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టో ఏసీలో కూర్చుని తయారు చేయలేదని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని సందర్శించి లక్షలాది మంది ప్రజల సూచనలు సలహాలు తీసుకుని మేనిఫెస్టో రూపొందించామని నడ్డా అన్నారు.

బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు*

Read More: Bhola Shankar Look: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. వింటేజ్ లుక్స్ అదుర్స్