Protest : కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలి.. బీజేపీ నిరసన

  Protest : దేశ రాజధాని ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)‌, ప్రతిపక్ష బీజేపీ(bjp)ల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌(Kejriwal arrested)కు నిరసనగా ఆప్‌ శ్రేణులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఇవాళ బీజేపీ శ్రేణులు నిరసన (protestకు దిగాయి. #WATCH | Delhi BJP President Virendraa Sachdeva detained during party's protest demanding resignation of […]

Published By: HashtagU Telugu Desk
BJP protest : Party demands CM Kejriwal's resignation

BJP protest : Party demands CM Kejriwal's resignation

 

Protest : దేశ రాజధాని ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)‌, ప్రతిపక్ష బీజేపీ(bjp)ల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌(Kejriwal arrested)కు నిరసనగా ఆప్‌ శ్రేణులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఇవాళ బీజేపీ శ్రేణులు నిరసన (protestకు దిగాయి.

మూడు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న ఆప్‌ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆంళోనలు షురూ చేసిన బీజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వాళ్లలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ కూడా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ను ఇటీవల ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్టైనా సీఎం పదవికి రాజీనామా చేయకుండా ఈడీ కస్టడీ నుంచే సీఎంగా ఆదేశాలు ఇస్తున్నారు. దాంతో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తున్నది.

Read Also:  Adani Group : రూ.3,350 కోట్లతో అది కొనేసిన అదానీ

  Last Updated: 26 Mar 2024, 02:18 PM IST