Site icon HashtagU Telugu

BJP Plans: ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్.. బీజేపీకే లాభమా?

Bjp

Bjp

రాజకీయ నాయకులకు ఏదైనా సాధ్యమే. గెలుపు కోసం ఎలాగైనా, ఏదైనా సరే వాడేస్తామంటారు. సమయం, సందర్భం కలిసి వస్తే ఇక ఆగుతారా? అందులోనూ బీజేపీకి ఇలాంటి పరిస్థితులను ఎలా క్యాష్ చేసుకోవాలో ఇంకా బాగా తెలుసు. అందుకే అప్పూకున్న ఫ్యాన్స్ బలాన్ని తన బలంగా మార్చుకునే ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలోనూ అదే ప్లాన్ ఉన్నట్టు కనిపిస్తోంది.

చిక్ బళ్లాపూర్ లో ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కూడా వచ్చారు. ఇక ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మామూలుగానే సినిమా సూపర్, డూపర్, బంపర్ హిట్ అంటూ పొగడ్తలతో ముంచేస్తారు. కానీ దీనిని ఎలా తమకు అనుకూలంగా రాజకీయనాయకులకు బాగా తెలుసు కదా. అందుకే ట్రిపుల్ ఆర్ సినిమా దేశం గర్వించదగ్గ సినిమా అవుతుందన్నారు సీఎం.

ఈ సినిమాను స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయ్, సుభాష్ చంద్రబోస్, రాణి చెన్నమ్మలకు అంకితం ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. అంటే.. దీని ద్వారా దేశభక్తి సెంటిమెంట్ ను ఉపయోగించుకుని బీజేపీ లబ్ది పొందాలని ప్లాన్ చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరిగ్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలంగాణలోని ముచ్చింతల్ లో సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా ఇలాగే లబ్ది పొందిందని గుర్తు చేస్తున్నారు. హిజాబ్ వివాదం, భగవద్గీతను పాఠ్యాంశంగా బోధిస్తామని చెప్పడం ఇవన్నీ ఈకోవలోనికే వస్తాయంటున్నారు. కర్ణాటకలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కమలనాథులు ఓ అడుగు ముందే ఉంటున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది.

Exit mobile version