Site icon HashtagU Telugu

BJP’s National Executive Meeting : టార్గెట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే

వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తో బీజేపీ అంతర్మథనంలో పడింది. 24 స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్థానాల్లోనే గెలుపొందింది.

ఉత్తరాదిలో తనకి తిరుగులేదనుకుంటున్న బీజేపీకి మెదటి నుండి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు తక్కువే. సౌత్ లో పట్టు సాధించాలని ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తోన్న కమలనాధులు ఇప్పుడు ఆ ప్రాసెస్ ని స్పీడప్ చేయాలనుకుంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళలో బీజేపీ ఇప్పటికిప్పుడు పట్టుసాధించడానికి అవకాశం లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయత్నిస్తే మంచి ఫలితాలుంటాయని బీజేపీ భావిస్తోంది.

Also Read : 94 ఏళ్ల వ‌య‌సులోనూ ఫుల్ ఫామ్‌లో అద్వానీ

తెలంగాణాలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల ఇక్కడ ఈజీగా పుంజుకోవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సత్తా చాటిన బీజేపీకి తాజాగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల విజయం బీజేపీ నేతల్లో ఆశలు రేపుతోంది. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని, ఆ ప్లేస్ బీజేపీ భర్తీ చేస్తుందని కాషాయపార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

ఇక ఏపీలో టీడీపీ, వైఎస్సార్సిపీ తో ప్రజలు విసిగిపోయారని జనసేనతో కలిసి అక్కడ అధికారంలోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

సౌత్ లో ఎంట్రీ కోసం బీజేపీ ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నా తాజాగా జరిగిన వాళ్ళ పార్టీ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించడం ఎలా అనే అంశంపై ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేశారట. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏమవుద్దో చూడాలి.

Exit mobile version