Site icon HashtagU Telugu

Shivraj Singh Chouhan : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్లేస్ లో శివరాజ్ సింగ్ చౌహన్..?

Shivraj Singh Chauhan

Shivraj Singh Chauhan

కేంద్రంలో మరోసారి విజయ డంఖా మోగించిన బిజెపి (BJP)..అనేక మార్పులు చేర్పులు చేస్తుంది. ఈసారి 400 టార్గెట్ గా పెట్టుకున్న బిజెపి కనీసం 300 మార్క్ కూడా సాధించలేకపోయింది. అయినప్పటికీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. తాజాగా నిన్న NDA సమావేశం జరుగగా..మరోసారి NDA కూటమి అధ్యక్షుడిగా మోడీ (Modi) ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నెల 9 ఎన్డీయే కూటమి అభ్యర్థిగా మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లు చాకచక జరుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడి (BJP National President) మార్పు చేసేందుకు డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. ఇప్పటి వరకు జెపి నడ్డా (JP Nadda) ఈ పదవిలో కొనసాగగా..ఇప్పుడు ఆయన ప్లేస్ లో మధ్యప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో 29 సీట్లను గెలిపించి క్లీన్ స్వీప్ చేసిన మాజీ సీఎం, మామాజీ గా మంచి పేరును సంపాదించుకున్న శివరాజ్ సింగ్ చౌహన్‌ (Shivraj Singh Chouhan) కు ఇవ్వాలని చూస్తున్నారట. మరోపక్క చౌహాన్‌కు కేంద్ర క్యాబినెట్‌లో అత్యంత కీలక మంత్రిగా తీసుకొనున్నారని కూడా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Barrelakka : లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క కు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?