Site icon HashtagU Telugu

BJP : 11 రాష్ట్రాల అధ్య‌క్షుల‌తో బీజేపీ చీఫ్ న‌డ్డా స‌మావేశం.. ప‌లు రాష్ట్రాల అధ్య‌క్ష‌లు ప‌నితీరుపై.. ?

Bjp National President Jp Nadda

Bjp National President Jp Nadda

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వ‌హించారు. దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో నేత‌లు చ‌ర్చించారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి కారణాలపై చర్చ జ‌రిగింది. దక్షిణాది ఎజెండాను రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధినీ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని బీజేపీ చీఫ్ నడ్డా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరు పై జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఆగ్రహాం వ్యక్తం చేశారు. పని తీరు మెరుగుప‌రుచుకోక‌పోతే ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పని తీరు అద్భుతంగా ఉందని న‌డ్డా ప్ర‌శంసించారు.