3 New CMs : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బంపర్ మెజారిటీతో గెలిచిన బీజేపీ.. ఆయా రాష్ట్రాలకు సీఎంలను నియమించడంపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం శుక్రవారం ఉదయం పరిశీలకులను నియమించింది. ఈ పరిశీలకులు ఇచ్చే నివేదికల ఆధారంగా మూడు రాష్ట్రాలకు సీఎంల పేర్లను బీజేపీ అధిష్టానం ఆదివారంకల్లా అనౌన్స్ చేయనుంది. రాజస్థాన్‌కు పరిశీలకులుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తవాడే, సరోజ్ పాండే నియమితులయ్యారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కె లక్ష్మణ్, ఆశా లక్రాలను మధ్యప్రదేశ్‌కు పరిశీలకులుగా నియమించారు. కేంద్రమంత్రులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ గౌతమ్‌లను ఛత్తీస్‌గఢ్‌కు పరిశీలకులుగా నియమించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ పరిశీలకులు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఎమ్మెల్యేలతో భేటీ అయి.. సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే దానిపై అభిప్రాయాలను సేకరిస్తారు. సీఎం రేసులో ఉన్న ముఖ్యమైన అభ్యర్థుల పేర్లతో ఒక నివేదికను బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు శనివారం రాత్రికల్లా సమర్పిస్తారు. ఆదివారం ఉదయం లేదా మధ్యాహ్నం కల్లా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సీఎంలు ఎవరనే దానిపై నడ్డా ప్రకటన విడుదల చేయనున్నారు. మరోవైపు సీఎం సీటును ఆశిస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్య నాయకులను ఢిల్లీకి పిలిపించి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చర్చిస్తున్నారు. సీఎం ఛాన్స్ పొందే అవకాశం లేని నాయకులను బుజ్జగిస్తున్నారని(3 New CMs) తెలుస్తోంది.