Site icon HashtagU Telugu

Kangana Ranaut : జై శ్రీరామ్ నినాదాలతో కంగనా రనౌత్ రోడ్ షో

BJP Mandi candidate Kangana Ranaut holds roadshow

BJP Mandi candidate Kangana Ranaut holds roadshow

Kangana Ranaut:లోక్‌సభ ఎన్నిక(Lok Sabha election)ల్లో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)మండి(Mandi) నుంచి బీజేపీ(bjp) తరఫున పోటీ చేస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఈరోజు ఆ నియోజక వర్గంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. జై శ్రీరామ్(Jai Sriram) నినాదాలతో ఆమెకు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. రోడ్ షోలో కంగనా రనౌత్ మాట్లాడారు.

రోడ్ షోకు చాలా మంది వచ్చారని, జాతీయవాద గళాన్ని వినిపించే మండి ప్రాంత బిడ్డ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తుందని ఇక్కడ ప్రజలు అందరూ గర్వపడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. బీజేపీకి అభివృద్ధే ప్రధాన అజెండా అని అన్నారు. మండి ప్రజలు తమ హృదయాల్లో ఏముందో దాన్నే ఈ ఎన్నికల్లో చూపిస్తారని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, 2021లో జరిగిన మండి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ గెలిచారు. ఈ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయడానికి నిరాకరిస్తున్నట్లు కనిపించారు. అయితే, నిన్న ప్రతిభా సింగ్ మాట్లాడుతూ తాను 2021లో గెలిచిన మండి స్థానం నుంచి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

Read Also: Harish Rao : పార్టీని వీడుతున్న నేతలను బ్రోకర్లతో పోల్చిన హరీష్ రావు

కాంగ్రెస్ నాయకత్వం ఆదేశిస్తే కంగనా రనౌత్‌పై పోటీ చేస్తానని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో హమీర్‌పూర్, మండి, సిమ్లా, కాంగ్రా స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 2021లో ఉప ఎన్నికలు జరగగా మండి స్థానాన్ని బీజేపీ కోల్పోయింది.