Site icon HashtagU Telugu

Rahul Gandhi: బీజేపీకి 150 సీట్లు కూడా రావు: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రాహుల్ అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మార్చాలనుకుంటున్న రాజ్యాంగాన్ని కాపాడటమే ఈ ఎన్నికల ఉద్దేశమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

మధ్యప్రదేశ్‌లోని రత్లాం-ఝబువా లోక్‌సభ స్థానానికి ప్రచారం చేసేందుకు జోబాట్ నగరానికి వెళ్లిన రాహుల్.. దేశంలో రిజర్వేషన్లను అంతం చేయబోమని అన్నారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తుందని అన్నారు. కుల గణనను సమర్థించారు రాహుల్. ఈ చర్య దేశంలో రాజకీయాల దిశను మారుస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఈసారి బీజేపీ 400 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తుందని, అయితే ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఈసారి షాక్ తగులుతుందని, ఎందుకంటే 150 సీట్లు కూడా గెలవదని రాహుల్ అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు కూల్చివేయాలని భావిస్తున్న రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

We’re now on WhatsAppClick to Join

ఆదివాసీలను భూమికి, అడవులకు మొదటి యజమానులుగా పరిగణిస్తున్నామని, మీ హక్కులను కాపాడేందుకు అటవీ హక్కుల చట్టం, పెసాను అమలు చేశామని. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే గిరిజనులు, దళితులు, ఓబీసీలు, సాధారణ కులాలకు చెందిన పేదల అభ్యున్నతి కోసం కుల ప్రాతిపదికన జనాభా గణన, ఆర్థిక గణన చేపడతామని రాహుల్ గాంధీ చెప్పారు.

Also Read: Supreme Court: కోవిషీల్డ్‌పై విచార‌ణ‌కు అంగీకరించిన సుప్రీంకోర్టు