Site icon HashtagU Telugu

Uttarakhand : కాల్పుల్లో బీజేపీ నేత భార్య మృతి…యూపీ పోలీసులపై హత్య కేసు..!!

Up Police

Up Police

నేరస్తులను పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. కానీ నేరస్థులకు పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై హత్య కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. మైనింగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య మరణించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. వారిపై హత్యకేసు కూడా నమోదు చేశారు.

అసలు విషయం ఏంటంటే..
యూపీలోని మొరదాబాద్ కు చెందిన 5గురు పోలీసులు మైనింగ్ మాఫియాను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్ లోని జస్పూర్ కు వెళ్లారు. అక్కడ క్రిమినల్ జాఫర్…భుల్లార్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు మైనింగ్ ముఠాకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ భార్య గుర్ ప్రీత్ కౌర్ మరణించింది. ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు యూపీ పోలీసులపై హత్య కేసు పెట్టారు.