మంగళవారం నూతన పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి మేఘ్వాల్, నారీశక్తి వందన్ (Nari Shakti Vandan) పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీఖార్జున ఖర్గే (Mallikarjun Kharge ) చేసిన వ్యాఖ్యలపై బిజెపి మహిళా నేతలు మండిపడ్డారు.
మల్లీఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ..’2010లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. వెనకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాలి. అన్ని పార్టీలు మహిళలను చిన్నచూపు చూస్తున్నాయి. ప్రశ్నించలేని మహిళలకు అవకాశం ఇచ్చారు” అని ఖర్గే మాట్లాడారు. దీంతో మహిళా నేతలను కించపరిచే విధంగా మల్లీఖార్జున ఖర్గే మాట్లాడుతున్నారని ఆయన ప్రసంగాన్ని బిజెపి నేతలు అడ్డుకున్నారు. ఆయన ప్రసంగం ఆపాలని పట్టుబట్టారు..చివరికి గందరగోళం ఏర్పడటంతో సభను వాయిదా వేశారు.
Read Also : Rahul Gnadhi: మోడీ తెలంగాణ ద్రోహి: రాహుల్ గాంధీ
మరోపక్క మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిరాకరించారు. ఈ బిల్లుకు మీరు మద్దతిస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. సరైన సమయం రాకుండా దీనిపై తాను వ్యాఖ్యానించలేనన్నారు.