Manipur Incidents : యావత్ దేశాన్ని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయంటూ విజయశాంతి ట్వీట్

మణిపూర్ ఘటన ఫై తెలంగాణ బీజేపీ లీడ‌ర్ విజ‌య‌శాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 06:30 PM IST

గత రెండు నెలలుగా మణిపూర్ (Manipur) లో కుకీలు, మెయిటీలకు మధ్య భయంకర పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. నడి రోడ్ ఫై ఇద్దరు మహిళలను వివస్త్రల్ని చేసి రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు ఒక్కోటిగా బయటకువస్తు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. అనేక ఇండ్లు, ఆస్తులు బూడిద‌య్యాయి. చాలా మంది రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. మణిపూర్ ఘటన (Manipur Incidents) లపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. రెండు నెల‌ల‌కు పైగా మ‌ణిపూర్ జాతి ఘ‌ర్ష‌ణ‌ల‌తో మండిపోతున్న‌ద‌నీ, దీనిపై ప్రధాని మోడీ (PM Modi) మాట్లాడాల‌నీ, పార్లమెంట్ లో చ‌ర్చ జ‌రగాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటె మణిపూర్ ఘటన ఫై తెలంగాణ బీజేపీ లీడ‌ర్ విజ‌య‌శాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మ‌ణిపూర్ హింస ఆందోళ‌న‌క‌ర‌మ‌ని అన్నారు. సభ్య సమాజం సిగ్గుతో బాధపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అభిప్రాయ‌ప‌డుతూ.. అత్యాచారం చేసిన ఘటనలో పాల్గొన్న నేరస్థులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటె మూడు నెలల తర్వాత ఇంటర్నెట్ సేవలకు మణిపూర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రాండ్‌బ్యాండ్ సేవలు పొందేందుకు అనుమతినిచ్చింది. స్థిరమైన ఒకే ఒక్క ఐపీ కనెక్షన్ (static IP connection) ఉన్న ఇంటర్నెట్ పరిమితంగా వినియోగించుకోవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Kargil War In Photos : కార్గిల్ లో ధర్మం గెలిచిన వేళ అది.. ఆసక్తికర ఫోటోలివి