బీజేపీ, కాంగ్రెస్ నడుమ ‘బ్రాహ్మణ’వివాదం

బ్రాహ్మణులు, బానియాల బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ లో దుమారం లేపుతున్నాయి. ఆ రెండు వర్గాలు బీజేపీ జేబులో ఉంటాయని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాన్ని వేడెక్కించాయి.

  • Written By:
  • Updated On - November 9, 2021 / 01:58 PM IST

బ్రాహ్మణులు, బానియాల బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ లో దుమారం లేపుతున్నాయి. ఆ రెండు వర్గాలు బీజేపీ జేబులో ఉంటాయని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాన్ని వేడెక్కించాయి. మత, కుల రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడి మాటలు చెప్పడం అలవాటు చేసుకుందని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. ఆ రెండు వర్గాలకు చెందిన కొందరు మురళీధర్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని మురళీధర్ అంటున్నారు.

Also Read : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులని వ్యాఖ్యానించారు. ఈ సామాజిక వర్గాల నుంచి ఎక్కువమంది పార్టీ కార్యకర్తలుగా వుండడం వల్ల మీడియా కూడా బీజేపీని బ్రాహ్మణ, బనియాల పార్టీగా పిలుస్తుందని అన్నారు. అయితే, బీజేపీ అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతుందని స్పష్టం చేశారు.

మరోపక్క, బ్రాహ్మణులు తమ జేబులో ఉన్నారన్న మురళీధర్ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనని విమర్శించారు. అహంకారంతో బిజెపి నేతలు మాట్లాడుతున్నారని, బ్రాహ్మణులు, బనియాలను కించపరిచారని అన్నారు. కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన మురళీధర్‌రావు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలను ఆ పార్టీ వక్రీకరించిందని మండిపడ్డారు. మొత్తం మీద బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ గా ఉన్న మురళీధర్ ఇప్పుడు అక్కడ వివాదాస్పదం అయ్యాడు. కులం కార్డు ను తీయడం తో బీజేపీ ఇరుకున పడింది.