LK Advani : ఆస్పత్రి నుంచి బీజేపీ దిగ్గజ నేత అద్వానీ డిశ్చార్జ్‌

బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి 96 ఏళ్ల ఎల్‌కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.

  • Written By:
  • Updated On - June 27, 2024 / 04:09 PM IST

LK Advani : బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి 96 ఏళ్ల ఎల్‌కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. అన్ని వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. వయో సంబంధిత సమస్యలతో అద్వానీ బాధపడుతున్నారని తెలిపారు. అద్వానీ(LK Advani) ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

అంతకుముందు అద్వానీ అస్వస్థతకు గురి కాగా.. అత్యవసర చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. ఈ ఆస్పత్రిలోని పాత ప్రైవేట్ వార్డులో ఆయనకు చికిత్స జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో  వైద్యులు చికిత్స అందించారు. అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అద్వానీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆయన ఆరోగ్యంపై ఆరాతీశారు. అద్వానీకి మెరుగైన వైద్యం అందించాలని ఎయిమ్స్ వైద్యులకు నిర్దేశించారు.

Also Read :Ratan Tata : వీధికుక్క కోసం అపర కుబేరుడు రతన్‌ టాటా అభ్యర్థన

  • దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది 2024లోనే ఎల్‌కే అద్వానీ స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఎల్‌కే అద్వానీ నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించారు. అద్వానీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన నివాసానికి వెళ్లి భారతరత్నను ప్రదానం చేశారు.
  • 1965 ఫిబ్రవరి 25న కమల అద్వానీని అద్వానీ వివాహం చేసుకున్నారు.
  • 2016 ఏప్రిల్ 6న కమల అద్వానీ కన్నుమూశారు.
  • ఎల్‌కే అద్వానీకి ఒక కుమార్తె ప్రతిభా అద్వానీ, కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు.
  • అద్వానీ కొడుకు, కూతురు ఇద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
  • ఎల్‌కే అద్వానీ 1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు.
  • కరాచీలోని సెయింట్  ప్యాట్రిక్స్ స్కూలులో అద్వానీ తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.
  • 1947 సెప్టెంబర్ 12న అద్వానీ కుటుంబం పాకిస్థాన్‌ను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చింది.
  • అద్వానీ తన కెరీర్‌లో మూడుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా, ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా, నాలుగు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.

Also Read :NEET-UG 2024 : ‘నీట్ మార్కుల గణన’.. ఎన్‌టీఏకు ‘సుప్రీం’ నోటీసులు