BJP Record: గుజరాత్ లో అధికారం దిశగా బీజేపీ!

గుజరాత్ లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

  • Written By:
  • Updated On - December 8, 2022 / 12:06 PM IST

బీజేపీ అంటే గుజరాత్, గుజరాత్ అంటే బీజేపీ (BJP). ఈ విషయం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. ఆప్ పార్టీ వరాలు గుప్పించినా, కాంగ్రెస్ చాణక్యం ప్రదర్శించినా గుజరాత్ ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. ఫలితంగా ఏడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం దాదాపు ఖాయమైంది. దీంతో యావత్‌దేశం దృష్టంతా హిమాచల్‌ప్రదేశ్ కౌంటింగ్‌పైనే పడింది. ఇక్కడ జరుగుతున్న కౌంటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వా -నేనా అన్నట్టు తలపడుతున్నాయి. బీజేపీ 153, కాగ్రెస్ 19 స్థానాల్లో, ఆప్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 35గా ఉండాలి. దీంతో అధికార పార్టీ బీజేపీ అసలైన రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టింది.

అయితే గుజరాత్ ఆప్ మాయ చేస్తుందని వివిధ రాజకీయ పార్టీలు భావించాయి. కానీ  బిజెపి దాదాపు అన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పశ్చిమ రాష్ట్ర ఎన్నికల రంగంలోకి AAP ప్రవేశించడం ద్వారా ఏర్పడిన త్రిముఖ పోటీలో కాంగ్రెస్ సుదూర రెండవ స్థానంలో నిలిచింది. ఆప్ ఆధిక్యం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.

గుజరాత్ లో భాజపా రికార్డ్ 153
కాంగ్రెస్ 19..
ఆప్ 6
ఇతరులు 4

Also Read: Sonia Gandhi : నేడు కాంగ్రెస్ ఎంపీల‌తో సోనియా గాంధీ భేటీ