Delhi Result : ఢిల్లీలో బీజేపీ లీడ్.. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ

దేశ రాజధాని ఢిల్లీలో కమల దళం దూసుకుపోతోంది.

Published By: HashtagU Telugu Desk
Mamata Banerjee

Mamata Banerjee

Delhi Result : దేశ రాజధాని ఢిల్లీలో కమల దళం దూసుకుపోతోంది. ఇక్కడి మొత్తం 7 లోక్‌సభ స్థానాలకుగానూ 6 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి కేవలం ఒకే స్థానంలో లీడ్‌లో(Delhi Result) కొనసాగుతోంది.

  • ఫరీదాబాద్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి క్రిషన్ పాల్ గుర్జార్ 1,765 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • చాందినీ చౌక్‌‌లో నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జేపీ అగర్వాల్‌ 3211 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • బీజేపీ నుంచి బాన్సురి స్వరాజ్ 5212 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • యోగేందర్ చందోలియా 16068 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • కమల్జీత్ సెహ్రావత్-17388  ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • రాంవీర్ సింగ్ బిధూరి 7212 , హర్ష మల్హోత్రా  2347 , హ్యాండ్స్ తివారీ  15505 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

బెంగాల్ టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ జరుగుతోంది. మొత్తం 42 స్థానాలకుగానూ బీజేపీ 21 స్థానాల్లో, టీఎంసీ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. లీడ్‌లో ఉన్నవారిలో అభిషేక్ బెనర్జీ, మహువా మొయిత్రీ, సుదీప్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ, శతాబ్ది రాయ్, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఉన్నారు. బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. ముర్షీదాబాద్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం లీడ్‌లో ఉన్నారు. బెర్హంపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ వెనుకంజలో ఉన్నారు.

Also Read : AP Results 2024: ఏపీలో ఎన్డీయే జోరు…మరికాసేపట్లో బాబు పవన్ భేటీ

  Last Updated: 04 Jun 2024, 10:30 AM IST