Congress Files: 70 ఏళ్లలో 4.8 లక్షల కోట్ల కుంభకోణాలు చేసిందంటూ కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో బీజేపీ ప్రచారం

  • Written By:
  • Publish Date - April 3, 2023 / 11:53 AM IST

యూపీఎ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ (Congress Files) పై బీజేపీ దాడికి దిగింది. తాజా ఆరోపణల్లో కాంగ్రెస్ ఫైల్స్ మొదటి ఎపిసోడ్ ను విడుదల చేసింది. ఈ వీడియోను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నరెండు సార్లు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి కేసులు ‘కాంగ్రెస్ ఫైల్స్’లో బయటపడ్డాయి‘కాంగ్రెస్ అంటే అవినీతి’ అనే వీడియో సందేశంలో బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో, ‘‘కాంగ్రెస్ తన 70 ఏళ్ల పాలనలో ప్రజల నుంచి రూ.48,20,69,00,00,000 లూటీ చేసిందంటూ బీజేపీ ఆ వీడియోలో ఆరోపించింది.

ఈ మొత్తంతో 24 ఐఎన్‌ఎస్ విక్రాంత్, 300 రాఫెల్ జెట్‌లు, 1,000 మార్స్ మిషన్‌లను నిర్మించవచ్చని లేదా కొనుగోలు చేయవచ్చని బీజేపీ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. అయితే కాంగ్రెస్ అవినీతికి దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, ప్రగతి పథంలో వెనుకబడిందని ఆగ్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పాలనను ‘కోల్పోయిన దశాబ్దం’గా బీజేపీ అభివర్ణించింది. మొత్తం 70 ఏళ్లను పక్కనపెట్టి, 2004-14 మధ్య యూపీఏ హయాంను పరిశీలిస్తే, తమ పాలనలో అది ‘కోల్పోయిన దశాబ్దం’ అని బీజేపీ పేర్కొంది. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం, ఆయన పాలనలో జరుగుతున్న అవినీతిని కళ్లకు కట్టారు. ఆ రోజుల్లో వార్తాపత్రికలు అవినీతి వార్తలతో నిండిపోయేవి, వీటిని చూసి ప్రతి భారతీయుడు సిగ్గుతో తల దించుకునేవాడని పేర్కొంది.

బీజేపీ విడుదల చేసిన వీడియో ‘కాంగ్రెస్ ఫైల్స్’ లో, ‘రూ. 1.8 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం, రూ. 1.7 లక్షల కోట్ల 2 జి స్పెక్ట్రమ్ కుంభకోణం, రూ. 10 లక్షల కోట్ల ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కుంభకోణం. రూ.70,000 కోట్ల కామన్వెల్త్ కుంభకోణం. వీడియో చివర్లో, ఇది కేవలం కాంగ్రెస్ అవినీతికి సంబంధించిన ‘ట్రైలర్’ అని, ‘సినిమా’ ఇంకా ముగియలేదని వెల్లడించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో రెండు పర్యాయాలు అవినీతి ఎలా ఆనవాయితీగా మారిందో, బీజేపీని, ప్రధాని మోదీని గెలిపించి సంకీర్ణ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని ఈ వీడియో ప్రజలకు గుర్తు చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.