Site icon HashtagU Telugu

BJP Operation Broom: బీజేపీ ఆపేరేషన్ బ్రూమ్

BJP Operation Broom

BJP Operation Broom

BJP Operation Broom: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని ఉద్దేశించారని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఇందు కోసం బీజేపీ ఆపేరేషన్ బ్రూమ్ ని ప్రవేశపెట్టిందని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ వేగంగా అభివృద్ధి చెందుతోందని గతంలో ప్రధాని చెప్పిన విషయాలను కేజ్రీవాల్ గుర్తు చేశారు. రానున్న రోజుల్లో దేశంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ బీజేపీకి గట్టి సవాల్‌ ఇవ్వవచ్చని, ఈ నేపథ్యంలోనే ఆప్ పార్టీని ముగించేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని కేజ్రీవాల్ చెప్పారు. భవిష్యత్తులో బీజేపీకి ఎలాంటి సవాల్‌ రాకుండా ఉండేందుకు ఆప్‌ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తున్నారని, పార్టీ కార్యాలయాలు ఖాళీ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.

సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఆప్ పార్టీ కేవలం కొంతమంది నేతల పార్టీ కాదని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కలల పార్టీ అని అన్నారు. వారు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. సరే నేను మీ ఆఫీసుకి వస్తున్నాను. మీరు మా అందరినీ అరెస్టు చేయండి. రాఘవ్ చద్దా విదేశాల నుంచి వచ్చారని, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. కాబట్టి మీరు అతిషి జీ, సౌరభ్ భరద్వాజ్ మరియు అందరినీ అరెస్ట్ చేయండని బీజేపీకి సవాల్ విసిరారు కేజ్రీవాల్.

Also Read: Warangal Airport : వరంగల్​ విమానాశ్రయ నిర్మాణం దిశగా మరో అడుగు