దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేసే పనిలో పడ్డారు. యూపీలో 80 సీట్లలో బిజెపి పార్టీకికి కంచుకోట అయిన మథుర (Mathura ) లోక్‌సభ స్థానం ప్రస్తుత ఎంపీ హేమమాలిని(BJP candidate Hema Malini)ని మరోసారి బరిలోకి దిగబోతుంది. హేమామాలిని 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014 సంవత్సరంలో మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ మథుర నియోజకవర్గం నుంచే బరిలోకిదిగి భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు మరోసారి బరిలోకి దిగుతుంది.
ఈ క్రమంలో నిన్న ఆమె తన నామినేషన్ (Hema Malini filed her Nomination) ను దాఖలు చేసింది. నామినేషన్‌తో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమె తన ఆస్తుల (Hema Malini Net Worth) వివరాలను సైతం పొందుపరిచింది. సమర్పించిన అఫిడవిట్‌లో హేమా మాలిని నికర ఆస్తి విలువ రూ.142 కోట్లుగా ఉంది. ఆమె మొత్తం రూ. 1,23,61,26,601 ఆస్తులు మరియు రూ .1,42,21,695 అప్పులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఆదాయం రూ. 1,22,19,04,906 తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
అఫిడవిట్ ప్రకారం, 74 ఏళ్ల హేమ మాలినిపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లోHonda Cars Offer: ఈ కార్లపై డిస్కౌంట్‌లను ప్రకటించిన హోండా కంపెనీ.. రూ. 83 వేల వరకు తగ్గింపు..! లేవు. తన భర్త ధర్మేంద్ర డియోల్‌లాగే నటనను తన వృత్తిగా ప్రకటించింది. ఆమె నటనను తన వృత్తిగా, అద్దె మరియు వడ్డీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయ వనరులుగా వెల్లడించింది. అలాగే 2012లో ఉదయపూర్‌లోని సర్ పదంపట్ సింఘానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ PhDని కలిగి ఉంది. ఆమె పేరు మీద బ్యాంక్ లో రూ. 99,93,177 మరియు ఆమె భర్త బ్యాంక్ ఖాతాలోరూ. 3,52,99,371 ఉన్నట్లు పేర్కొంది. రుణాలు , అడ్వాన్స్ పరంగా హేమ మాలిని పేరు మీద రూ. 4,28,54,044 , భర్త పేరు మీద రూ. 7,19,13,764 ఉన్నట్లు పేర్కొంది.
ఇక హేమ మాలిని వద్ద మెర్సిడెజ్ బెంజ్, AL-CAZAR, మారుతి EECO మొదలైన వాటితో పాటు రూ. 61,53,816 విలువైన వాహనం ఉంది, భర్తకు మోటార్ బైక్‌తో పాటు రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో వంటి వాహనాలు ఉన్నట్లు తెలిపింది. ఇక బంగారం , వెండి , వజ్రాల విషయానికి వస్తే..రూ. 3,39,39,307 విలువైన బంగారం, వెండి, వజ్రాలు మరియు విలువైన రాళ్లు ఈమె వద్ద ఉండగా, ధర్మేంద్ర వద్ద రూ. 1,07,48,200 విలువైన బంగారం ఉంది. ఇవి కాకుండా, హేమ ఇతర ఆస్తులు రూ. 8,96,256 మరియు ధర్మేంద్ర విలువ రూ. 29,53,518 పేర్కొంది.
Read Also :