Delhi Assembly Elections : ఈ ఎన్నికలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు: అరవింద్‌ కేజ్రీవాల్‌

వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు" అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

Published By: HashtagU Telugu Desk
BJP has no agenda in this election: Arvind Kejriwal

BJP has no agenda in this election: Arvind Kejriwal

Delhi Assembly Elections : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోన్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఆప్‌, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. అరోప్‌ పత్ర పేరిట ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ రెండు రోజుల క్రితం తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అసమర్థ ప్రభుత్వమని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా మాట్లాడారు. “ఈ ఎన్నికల కోసం బీజేపీకి ఎలాంటి అజెండా లేదు. ఇంత వరకూ సీఎం అభ్యర్థి కూడా లేరు. బీజేపీకి ఎలాంటి విజన్‌ లేదు. వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు” అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

కాగా, అందరికీ ఉచిత నీరు అని చెప్పారు. నేడు ప్రజలు ట్యాంకర్లకు వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఢిల్లీని కాలుష్య రహితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. చివరికి వాళ్ల మంత్రులే కటకటాల పాలయ్యారు అని అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అసమర్థ ప్రభుత్వామని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నంబర్‌ 1. దేశంలోనే అత్యంత అవినీతిపరులైన మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు అంటూ కేజ్రీవాల్‌పై అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్‌జీ.. మీరు తరచుగా నంబర్‌ 1 అని చెబుతుంటారు. మీరు ఎందులో నంబర్‌ 1..? దేశంలోనే అత్యంత ఖరీదైన నీటిని మీ ప్రభుత్వం అందిస్తోంది..అని అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు.

Read Also: No Detention Policy : 5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో డిటెన్షన్‌’ రద్దు

  Last Updated: 23 Dec 2024, 05:50 PM IST