Basangouda Patil Yatnal : ఎమ్మెల్యేను బహిష్కరించిన బీజేపీ

Basangouda Patil Yatnal : పార్టీ ప్రకటనలో బసనగౌడ పాటిల్ యత్నల్‌ను పార్టీ నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు, ఇకపై ఆయనకు ఎలాంటి పదవులు లభించవని వెల్లడించింది

Published By: HashtagU Telugu Desk
Basangouda Patil Yatnal Ran

Basangouda Patil Yatnal Ran

బీజేపీ కర్ణాటక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్‌(Basangouda Patil Yatnal)పై కఠిన చర్యలు తీసుకుంది. ఇటీవల నటి రన్యా రావు(Ranyarao)పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనతో పాటు, ఆయన పదే పదే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు పార్టీ (BJP) గుర్తించింది. దీంతో ఆయన్ను బీజేపీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించనున్నట్లు (boycott) ప్రకటించింది. పార్టీ నిబంధనలు పాటించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పార్టీ గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, అనేక మార్లు హెచ్చరికలు వచ్చినా మార్పు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ స్పష్టం చేసింది.

Ugadi Diary 2025 : తెలంగాణ సీఎం చేతులమీదుగా అర్చక ఉద్యోగ జేఏసీ డైరీ ఆవిష్కరణ

పార్టీ ప్రకటనలో బసనగౌడ పాటిల్ యత్నల్‌ను పార్టీ నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు, ఇకపై ఆయనకు ఎలాంటి పదవులు లభించవని వెల్లడించింది. నటి రన్యా రావుపై చేసిన అసభ్య వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇది పార్టీకి హానికరం అవుతుందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పార్టీ అధినాయకత్వం భావించింది. దీనికి తోడు గతంలో కూడా ఆయన అనేక వివాదాలకు కారణమయ్యారని, పలుమార్లు పార్టీ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

ఈ నిర్ణయం కర్ణాటక రాజకీయాల్లో పెనుచర్చకు దారి తీసింది. బసనగౌడ పాటిల్ యత్నల్‌ను బహిష్కరించడం ద్వారా, భవిష్యత్తులో పార్టీ నియమాలు పాటించని నేతలపై ఇలాంటివే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ సంకేతం ఇచ్చింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

  Last Updated: 26 Mar 2025, 10:04 PM IST