Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాక్ అనుకూల నినాదాలు..!

Bharat Jodo Yatra

Bharath Jodo Yatra

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు లేవనెత్తారని భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా శుక్రవారం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో రాహుల్‌గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో పాకిస్థాన్‌కు అనుకూల నినాదాలు చేశారని ఆరోపించారు. ఈ జోడోయాత్రకు సంబంధించిన విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు.

అయితే దీనిని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ జైరాంరమేష్ ఖండించారు. భారత్ జోడో యాత్రను అప్రతిష్టపాలు చేసేందుకు మార్ఫింగ్ వీడియో హల్ చల్ చేస్తోందని అన్నారు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు. తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని, అలాంటి వ్యూహాలకు మేం సిద్ధంగా ఉన్నామని, తగిన సమాధానం చెబుతామని జైరామ్ రమేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన రాహుల్ యాత్ర మహారాష్ట్ర దశను పూర్తి చేసుకుని నవంబర్ 23న బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఖాండ్వాలోని బోర్గావ్ నుండి పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో యాత్ర కొనసాగుతుండగ.. వచ్చే నెల 4న రాజస్థాన్‌లో యాత్ర ప్రవేశించినుంది.

 

Exit mobile version