JP Nadda: జేపీ నడ్డా భార్య కారు చోరీ

  JP Nadda: భారతీయ జనతాపార్టీ(bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) భార్య కారు చోరీకి గురైంది (Toyota Fortuner Stolen). ఢిల్లీ(Delhi)లో గల గోవింద్‌పురి ప్రాంతం(Govindpuri area)లో కారు అపహరణకు గురైనట్లు సమాచారం. మార్చి 19వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కారు చోరీకి గురైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. We’re now on WhatsApp. Click to Join. సదరు కథనాల […]

Published By: HashtagU Telugu Desk
BJP Chief JP Nadda's Wife's Toyota Fortuner Stolen in Delhi

BJP Chief JP Nadda's Wife's Toyota Fortuner Stolen in Delhi

 

JP Nadda: భారతీయ జనతాపార్టీ(bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) భార్య కారు చోరీకి గురైంది (Toyota Fortuner Stolen). ఢిల్లీ(Delhi)లో గల గోవింద్‌పురి ప్రాంతం(Govindpuri area)లో కారు అపహరణకు గురైనట్లు సమాచారం. మార్చి 19వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కారు చోరీకి గురైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

సదరు కథనాల ప్రకారం.. తెల్లటి టయోటా ఫార్చునర్‌ కారును డ్రైవర్‌ జోగీందర్‌ సర్వీసింగ్‌ కోసం తీసుకెళ్లాడు. సర్వీసింగ్‌ అనంతరం కారును నడ్డా నివాసానికి తీసుకొస్తున్నాడు. మార్గం మధ్యలో తన నివాసం వద్ద భోజనం చేసేందుకు కారును ఆపాడు. కారును ఇంటి ముందు ఆపి భోజనం చేసి వచ్చే సరికి కారు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కారుకోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు.. కారును గురుగ్రామ్‌ వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అపహరణకు గురైన కారు హిమాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఉంది. ఆరు రోజులైనా ఇప్పటి వరకూ కారు ఆచూకీ మాత్రం తెలియరాలేదని సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:  Lok Sabha Polls 2024; హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌

కాగా, జేపీ నడ్డా భార్య కారు తెల్లని రంగు ఫార్చూనర్ కారు దొంగతనానికి గురయ్యిందని ఫిర్యాదులో డ్రైవర్ జోగిందర్ పేర్కొన్నారు. కారు హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉంది. కారు నంబర్ హెచ్‌పీ 03 డీ 0021 అని ఫిర్యాదులో డ్రైవర్ వెల్లడించారు. కారు ఎక్కడ ఉందో కనుగొనేందుకు పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

  Last Updated: 25 Mar 2024, 01:46 PM IST