BJP : ‘మే మోదీ కా పరివార్ హూ’..బీజేపీ ప్రచార గీతం విడుదల

  BJP Campaign Song: మరికాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్( Lok Sabha Elections Schedule) విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే బీజేపీ(bjp) తన ప్రచారాస్త్రాన్ని బయటకు తీసింది. ఎన్నికల ప్రచార గీతాన్ని(Election campaign song) శనివారం ఉదయం విడుదల చేసింది. ప్రతిపక్ష నేతల విమర్శలనే ఆయుధంగా చేసుకుని సాగే ఈ పాటలో అన్ని రాష్ట్రాల ప్రజలను చూపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సింబాలిక్ గా చూపిస్తూ.. మేమంతా […]

Published By: HashtagU Telugu Desk
Main Modi Ka Parivar Hoon C

Main Modi Ka Parivar Hoon C

 

BJP Campaign Song: మరికాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్( Lok Sabha Elections Schedule) విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే బీజేపీ(bjp) తన ప్రచారాస్త్రాన్ని బయటకు తీసింది. ఎన్నికల ప్రచార గీతాన్ని(Election campaign song) శనివారం ఉదయం విడుదల చేసింది. ప్రతిపక్ష నేతల విమర్శలనే ఆయుధంగా చేసుకుని సాగే ఈ పాటలో అన్ని రాష్ట్రాల ప్రజలను చూపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సింబాలిక్ గా చూపిస్తూ.. మేమంతా మోదీ కుటుంబమే అంటూ వారు పాడడం వీడియోలో కనిపిస్తుంది. ఇటీవల ఇండియా కూటమి బీహార్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. మోడీకి కుటుంబమే లేదు, ఇక కుటుంబ సమస్యలు ఏం తెలుస్తాయంటూ విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనిపై మోడీఘాటుగా స్పందిస్తూ.. దేశంలోని 150 కోట్ల మంది జనం తన కుటుంబమేనని చెప్పారు. ఈ విమర్శను అనుకూలంగా మార్చుకున్న బీజేపీ.. ‘మోదీ కా పరివార్’(‘Modi Ka Parivar’) పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు అంతా తమ సోషల్ మీడియా ఖాతాలలో మే మోదీ కా పరివార్ అంటూ డీపీలు పెట్టుకున్నారు. తాజాగా ఇదే విమర్శను బీజేపీ తన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు తామంతా మోదీ కుటుంబమేనని చెబుతున్నట్లు ప్రచార గీతాన్ని సిద్ధం చేసి విడుదల చేసింది.

  Last Updated: 16 Mar 2024, 09:04 PM IST