BJP WhatsApp Head : ఇప్పటిదాకా రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా హెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం హెడ్‌లు ఉండటాన్ని మనం చూశాం. సోషల్ మీడియాను వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ హెడ్ (వాట్సాప్ ప్రముఖ్)ను బీజేపీ నియమించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వాట్సాప్ హెడ్‌గా రాంకుమార్ చౌరాసియాను నియమించారు. వాట్సాప్ ద్వారా పార్టీకి సంబంధించిన ప్రచారం చేయడం, వాట్సాప్ ద్వారా పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు చేరవేయాల్సిన పోస్ట్‌ల గురించి ప్రణాళికా బద్ధంగా పనిచేయడం ఈయన విధులు. మొత్తం మీద సోషల్ మీడియాను సమర్ధంగా వినియోగించుకునే విషయంలో ఇతర రాజకీయ పార్టీల కంటే బీజేపీ ఒక అడుగు ముందే ఉంటోంది.
Also Read :Formula E race: ‘ఫార్ములా ఈ-రేసు’ కేసు.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ
రాంకుమార్ చౌరాసియా ఎవరు ?
- రాంకుమార్ చౌరాసియా మధ్యప్రదేశ్‌లోని రయిసెన్ జిల్లాలో జన్మించారు. గత 30 ఏళ్లుగా భోపాల్‌లో నివసిస్తున్నారు.
- ఆయన ఒక ప్రైవేటు ఉద్యోగి. ఎమ్మెస్సీ డిగ్రీని రాంకుమార్ చౌరాసియా పూర్తి చేశారు.
- భోపాల్ నగరంలోని 223వ బూత్ పరిధిలో రాంకుమార్ ఉంటున్నారు.
Also Read :Rama Murthy Naidu Funeral : తమ్ముడి పాడె మోస్తూ చంద్రబాబు కన్నీరు
ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..
మధ్యప్రదేశ్‌లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ చాలా క్రియేటివ్‌గా ముందుకుసాగుతోంది. రాష్ట్రంలోని 65,015 బూత్‌లలో ప్రతీదానిలో బూత్ అధ్యక్షుడు, బూత్ మినిస్టర్, బూత్ పార్టీ వర్కర్స్, వాట్సాప్ హెడ్, మన్ కీ బాత్ హెడ్, బెనిఫీషియరీ హెడ్, పన్నా హెడ్ వంటి పదవులను బీజేపీ భర్తీ చేస్తోంది. ఈ కాన్సెప్ట్ నుంచి మధ్యప్రదేశ్‌లో పార్టీకి రాష్ట్ర స్థాయి వాట్సాప్ హెడ్‌ను(BJP WhatsApp Head) నియమించాలనే ఆలోచన రాష్ట్ర బీజేపీ పెద్దలకు వచ్చింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ బీజేపీ హెడ్‌గా నియమితులైన రాంకుమార్ చౌరాసియా.. ప్రతీ బూత్‌లో ఉన్న బీజేపీ వాట్సాప్ హెడ్‌తో కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేయనున్నారు.