BJP 5th List : బిజెపి ఐదో జాబితా విడుదల..కంగనా రనౌత్‌ ఎక్కడి నుండి పోటీ అంటే..!!

ఈ ఐదో జాబితాలో ఏకంగా 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. హిమాచల్​ ప్రదేశ్​ మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ సినీనటి కంగనా రనౌత్​ను బరిలోకి దింపారు

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 10:24 PM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బిజెపి (BJP)..తన దూకుడు ను పెంచుతుంది. ఇప్పటికే నాల్గు జాబితాలను విడుదల చేసి, ప్రచారం ముమ్మరం చేసిన అధిష్టానం.. ఆదివారం ఐదో జాబితాను విడుదల చేసింది. ఈ ఐదో జాబితాలో ఏకంగా 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. హిమాచల్​ ప్రదేశ్​ మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ సినీనటి కంగనా రనౌత్ (Kangana Ranaut)​ను బరిలోకి దింపారు. ఇక రామాయణం సీరియల్ నటుడు అరుణ్​ గోవెల్​ను మేరఠ్​ స్థానం నుంచి బరిలోకి దింపగా.. ప్రముఖ వ్యాపారవేత్త నవీన్​ జిందాల్​కు కురుక్షేత్ర సీటు కేటాయించింది.

అలాగే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఖమ్మంకు తాండ్ర వినోద్ రావు, వరంగల్ కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను ప్రకటించింది. అరకు స్థానానికి కొత్తపల్లి గీత, అనకాపల్లికి సీఎమ్ రమేశ్, రాజమండ్రి స్థానానికి దగ్గుబాటి పురంధేశ్వరి, నరసాపురం స్థానానికి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతికి వరప్రసాద్ రావు, రాజంపేట పార్లమెంట్ స్థానానికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. వైసీపీ మాజీ నేత, ఎంపీ రఘురామరాజు కు మాత్రం షాక్ ఇచ్చింది. నరసాపురం టికెట్ వస్తుందని రఘురామా భావించారు కానీ ఆయనకు టికెట్ ఖరారు చేయలేదు.

ఇక అలాగే బీహార్ నుంచి 17 మందికి, గోవా 1, గుజరాత్ 6, హర్యాన 4, హిమాచల్ ప్రదేశ్ 2, జార్ఖండ్ 3, కర్ణాటక 4, కేరళ 4, మహారాష్ట్ర 3, మిజోరం 1, ఒడిశా 18, రాజస్థాన్ 7, సిక్కిం 1, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 19 మందిని ప్రకటించింది.

Read Also : Unnamatla Eliza: కాంగ్రెస్‌లో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్యే