BJD MLA Cheating: ప్రియురాలిని మోసం చేసిన ఎమ్మెల్యే! రాసలీలల ఫోటోలు వైరల్

పేరుకు ఎమ్మెల్యే.. కానీ ప్రియురాలిని మోసం చేసిన ఘటనలో ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Bjd Mla Marriaged

Bjd Mla Marriaged

పేరుకు ఎమ్మెల్యే.. కానీ ప్రియురాలిని మోసం చేసిన ఘటనలో ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. ఒడిశాలోని జగత్ సింఘ్ పూర్ జిల్లా తిర్తోల్ బీజేడీ ఎమ్మెల్యే అయిన విజయశంకర్ దాస్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. సోమాలిక దాస్ అనే యువతి ఈ మేరకు జగత్ సింఘ్ పూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎమ్మెల్యేపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.

ఎమ్మెల్యే విజయశంకర దాస్, సోమాలిక ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చనువుగా ఉన్నప్పుడు ఫోటోలు కూడా దిగారు. ఇద్దరూ పెళ్లికి అంగీకారం తెలుపుతూ.. రిజిస్టర్ మ్యారేజ్ కోసం సిద్ధమయ్యారు. దీనికోసం జగత్ సింఘపూర్ జిల్లా రిజిస్టార్ ఆఫీసులో మ్యారేజ్ కోసం మే 17న దరఖాస్తు కూడా చేశారు. కనీస గడువైన 30 రోజుల వ్యవధి పూర్తవ్వడంతో సోమాలిక.. రిజిస్టార్ ఆఫీసులో వివాహానికి హాజరైంది. కానీ పెళ్లికొడుకైన ఎమ్మెల్యే మాత్రం రాలేదు.

పెళ్లి చేసుకుంటానన్న ఎమ్మెల్యే హ్యాండివ్వడంతో సోమాలిక షాక్ కు గురైంది. దీంతో తాను మోసపోయానని భావించి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఎమ్మెల్యే విజయశంకర్ దాస్.. మరో ఐదుగురితో కలిసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఆయనతో చనువుగా కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి కాస్తా వైరలయ్యాయి.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మాత్రం సోమాలిక చేసిన పనిని తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ఆమెను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానన్నారు. రిజిస్టర్ వివాహం కోసం అప్లయ్ చేసిన రోజు నుంచి 90 రోజుల గడువులోపు పెళ్లి చేసుకోవచ్చని.. ఇప్పటికి ఇంకా నెల రోజులు మాత్రమే అయ్యిందని.. మరో రెండు నెలల సమయం ఉందని చెప్పారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేనందున తాను ఆగాల్సి వచ్చిందన్నారు. సోమాలికకు ఆల్రెడీ ఈ విషయం చెప్పానన్నారు.

  Last Updated: 20 Jun 2022, 01:25 PM IST