Another Pandemic : మ‌రో మ‌హ‌మ్మారి త‌స్మాత్ జాగ్ర‌త్త‌

'వ‌ర్క్ ఫ్రం హోం' ప‌ద్ద‌తిని ఏప్రిల్ నుంచి తొలగించాల‌ని మ‌ల్లీనేష‌నల్ కంపెనీల‌తో పాటు దేశీయ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి.

  • Written By:
  • Updated On - February 23, 2022 / 03:43 PM IST

‘వ‌ర్క్ ఫ్రం హోం’ ప‌ద్ద‌తిని ఏప్రిల్ నుంచి తొలగించాల‌ని మ‌ల్లీనేష‌నల్ కంపెనీల‌తో పాటు దేశీయ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. ఆ మేర‌కు ఉద్యోగుల‌కు స‌మాచారం ఆయా కంపెనీలు ఇచ్చాయ‌ని తెలుస్తోంది. ఇదంతా తెలంగాణ‌తో పాటు ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేస్తోన్న ఒత్తిడి కార‌ణంగా జ‌రుగుతోన్న త‌తంగం. కానీ, సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, బిల్ గ్రేట్స్ మ‌రో ర‌కంగా క‌రోనా వైర‌స్ పై స్పందించారు. రాబోవు రోజుల్లో మ‌రింతగా మ‌రో ముప్పు ఉండే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్టూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించ‌డం యావ‌త్తు ప్ర‌పంచాన్ని ఆలోచింప చేస్తోంది.బిల్ గేట్స్ ఎప్పుడూ ముందు చూపుతో ఉంటారు. పైగా ఆయ‌న ఫౌండేష‌న్ ద్వారా ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతుంటారు. వాళ్ల నుంచి స‌మాచారం లేకుండా కోవిడ్ ప్ర‌భావం గురించి రియాక్ట్ అయ్యే అవ‌కాశం లేదు. రాబోయే రోజుల్లో ఖ‌చ్చితంగా ప్ర‌మాద‌క‌ర వైర‌స్ వ‌స్తుంద‌ని గేట్స్ చెబుతున్నాడు. రాబోయే మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశముందని అన్నారు. కానీ, ఇది కరోనా వైరస్‌ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యాధికారక వైరస్‌ల నుంచి వచ్చే అవకాశముందని వెల్ల‌డించాడు. వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో క‌రోనా ఉద్ధృతి ప్ర‌స్తుతం తగ్గుముఖం ప‌ట్టింది. రోగనిరోధక స్థాయిలు పెరగడంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తట్టుకోగలిగామ‌ని గేట్స్ అన్నాడు. అయితే, కొవిడ్‌ తగ్గుతున్నప్పటికీ.. ప్రపంచంపై మరో మహమ్మారి విరుచుకుపడే అవకాశాలు కన్పిస్తున్నాయ‌ని చెప్పాడు. బహుశా కరోనా కుటుంబం నుంచి గాక, వేరే వైరస్‌ నుంచి కావొచ్చని వివ‌రించాడు. వృద్ధులు, ఊబకాయం, డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు’’ అని బిల్‌ గేట్స్ అంత‌ర్జాతీయ ప‌త్రిక సీఎన్బీసీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

వాస్త‌వంగా క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ బిల్ గేట్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలోనే న‌డుస్తోంది. దాని య‌జ‌మాని బిల్ గేట్స్ అనే విష‌యాన్ని సామాజిక కార్య‌క‌ర్త మేధాపాట్క‌ర్ చేసిన ప్ర‌క‌టించగా మరాఠీ వార్తా వెబ్‌సైట్ లోక్‌సత్తా ప్ర‌క‌టించింది. అంతేకాదు, మ‌రో మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికించ‌బోతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించ‌డం…మేధాపాట్క‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న జోడించి చూస్తే బిల్ గేట్స్ చెప్పిన‌ట్టు భ‌విష్య‌త్ ఉండ‌బోతుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ్యూహాన్ ల్యాబ్ ఇచ్చిన స‌మాచారం ప్ర‌కార‌మే బిల్ గేట్స్ రాబోయే వైర‌స్ గురించి ప్ర‌స్తావించి ఉంటార‌ని వైద్య నిపుణులు సైతం భావిస్తున్నారు. వ్యూహాన్ ల్యాబ్ నుంచి వెలువ‌డిన కోవిడ్ ప్ర‌స్తుతం ఓమిక్రాన్ రూపంలో ఉంది. దాని ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంద‌ని భావిస్తోన్న కంపెనీలు ఉద్యోగుల‌ను ఆఫీస్ ల‌కు రావాల‌ని పిలుస్తున్నారు. ప్ర‌భుత్వాలు ఆ మేర‌కు కంపెనీల‌పై ఒత్తిడి తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.ఓమిక్రాన్ చాలా డేంజ‌ర్ అనే విష‌యాన్ని సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ వెల్ల‌డించాడు. మొద‌టి వేవ్ క‌రోనా స‌మ‌యంలో నాలుగు రోజులు మాత్ర‌మే ఇబ్బంది పెట్టింద‌ని పేర్కొన్నాడు. కానీ, ఓమిక్రాన్ 25 రోజులుగా ఇబ్బంది పెడుతుంద‌ని స్వానుభవాన్ని వెల్ల‌డించాడు. అందుకే, భౌతిక విచార‌ణ‌ను ఇప్ప‌ట్లో ప్రారంభించ‌లేమ‌ని తేల్చేశాడు. ఓమిక్రాన్ చాలా స్వ‌ల్ప ప్ర‌భావాన్ని చూపే వైర‌స్ అంటూ సుప్రీం కోర్టు బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్, సీనియ‌ర్ న్యాయ‌వాది వికాస్ సింగ్ చేసిన వాద‌న‌పై ఎన్వీ ర‌మ‌ణ సీరియ‌స్ గా స్పందించాడు. ఒక వైపు మైక్రో సాఫ్ట్ ఫౌండ‌ర్ బిల్ గేట్స్ మ‌రో ప్ర‌మాద‌ర‌క ముప్పు ఉంద‌ని చెబుతుంటే, ఓమిక్రాన్ ను త‌క్కువ అంచ‌నా వేయొద్ద‌ని సుప్రీం కోర్టు సీజేఐ ర‌మ‌ణ చెబుతున్నారు. కానీ, ప‌లు కంపెనీలు ప్ర‌భుత్వాల ఒత్తిడి మేర‌కు వ‌ర్క్ ఫ్రం హోమ్ ను తొల‌గించడానికి సిద్ధం కావ‌డం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో..చూడాలి!