Site icon HashtagU Telugu

Attack on CM: సీఎం నితీష్ పై.. బీహార్ యువకుడు దాడి..!

Attack On Cm Nitish Kumar

Attack On Cm Nitish Kumar

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఓ అకతాయి దాడి చేయ‌డం దేవ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. భీహార్​ సీఎం నితీశ్​ కుమార్ ఆదివారం పట్నాలోని త‌న స్వ‌గ్రామ‌మైన‌ భ‌కిత్యాపూర్​లో ఓ పబ్లిక్ మీటింగ్​కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో అక్కడ స్థానిక ఆస్పత్రిలో ప్రతిష్టించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన త‌ర్వాత నితీశ్ కుమార్ నివాళులు అర్పిస్తుండగా, ఓ యువకుడు వేదికపైకి ఎక్కి ముఖ్యమంత్రిపై దాడి చేశారు.

షిల్ భద్ర యాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నప్పుడు ఓ యువకుడు వెనుక నుంచి వేగంగా నడుచుకుంటూ స్టేజ్‌పైకి వచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటుకుని వచ్చిన యువకుడు సీఎం వీపుపై బలంగా కొట్టాడు. మరోసారి కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి విచారిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సరిగాలేదని స్థానికులు అంటున్నారు. భద్రతా సిబ్బంది ఉండగా ఓ వ్యక్తి ఇలా దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తుందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.

ఇకపోతే సీఎం నితీశ్ పై దాడి జ‌ర‌గ‌డం ఇదే మొద‌టి సారి కాదు. గ‌తంలో కూడా బిహార్ సీఎంపై దాడి జరిగింది. 2020 నవంబ‌ర్‌లో మధుబని జిల్లాలోని హర్లాఖిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు నితీష్ కుమార్ పై ఉల్లిపాయలు విసిరారు. త‌న‌పై ఉల్లిపాయలు విసరడంతో మొదట షాక్ అయిన‌ నితీశ్, ఆ తర్వాత లైట్ తీసుకుని ఇంకా విస‌రండి అని హాస్యాస్పదంగా అన్నారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది నితీశ్ చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. దీంతో నిందితుడు ఎవరైనా వదిలేయమని అతని గురించి పట్టించుకోవద్దని భద్రతా సిబ్బందికి సూచించారు. అయితే ఇప్పుడు మ‌రోసారి సీఎం నితీశ్ కుమార్ పై దాడి ఘ‌ట‌న‌తో భద్రతా సిబ్బందితో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.