Site icon HashtagU Telugu

Patna : శానిటరీ పాడ్స్ గురించి అడిగితే…కండోమ్స్ కూడా ఫ్రీగా కావాలా అంటూ..బాలికలతో మహిళా అధికారి వ్యంగ్యం..!!

Bihar

Bihar

అధికారులు తమ స్థాయి…హొదాకు తగ్గట్లుగా మాట్లాడాలి. ఆఫీసర్ హోదాలో ఉన్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే…ప్రజలు ఎదురుతిరిగే రోజులు కూడా ఉంటాయి. ముఖ్యంగా సున్నితమైన అంశాల్లో ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. బీహార్ లో ఓ మహిళా IAS అధికారి తీరు ఇఫ్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తక్కువ ధరలకు స్కూలు విద్యార్థినులకు శానిటరీ పాడ్స్ అందించాలని ఓ విద్యార్థిని అడిగింది. దీనికి సమాధానంగా ఆ ఐఏఎస్ అధికారిణి…కండోమ్స్ కూడా ఉచితంగా కావాలా అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. ఇప్పుడు ఈ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది.

అమ్మాయిల గౌరవాన్ని పెంచండి అనే కార్యక్రమం బీహార్ లోని పాట్నాలో ఉన్న మురికి వాడలకు చెందని విద్యార్థులతో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ భ్రమా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె ప్రసంగించారు. అయితే ఓ విద్యార్థిని ప్రభుత్వం రూ. 20-30 రూపాయలకు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వగలదా అంటూ ప్రశ్నించింది. దీంతో ఆ అధికారి కోపంతో రగిలిపోయింది. ఇప్పుడు శానిటరీ పాడ్స్ రేపు జీన్స్… ఆ తరువాత బూట్లు, అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు.

అంతటితో ఊరుకోకుండా రేపు పెళ్లి తర్వాత కుటుంబ నియంత్రణ కోసం కండోమ్స్ కూడా ఉచితంగా ఇవ్వమని అడుగుతారంటూ మాట్లాడింది. దీంతో ఆ చిన్నారులంతా షాక్ అయ్యారు. ఈ కార్యక్రమంలో 9. 10వ తరగతి విద్యార్థినులే ఎక్కువగా ఉన్నారు. మహిళా అధికారి అయి ఉండి ఇలా మాట్లాడటం సరికాదంటూ జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

Exit mobile version