Site icon HashtagU Telugu

Prashant Kishor : బీహార్ పాలిటిక్స్.. రాహుల్‌గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్

Bihar Politics.. Prashant Kishor challenges Rahul Gandhi

Bihar Politics.. Prashant Kishor challenges Rahul Gandhi

Prashant Kishor : బీహార్ రాజకీయాలు వేడి కప్పుకుంటున్నాయి. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ తమ బలబాండవాలు, వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటములు రంగంలోకి దిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బీహార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి పర్యటనలు, సభలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కొత్త పథకాలు ప్రకటిస్తూ ఓ వైపు ప్రచార వేగాన్ని పెంచుతోంది. తాజాగా కేంద్రం బీహార్‌లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనదిగా చెబుతున్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ జనసురాజ్ ఉద్యమ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో జోరందిస్తున్నారు.

Read Also: CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్‌క్లేవ్‌ ప్రారంభం

ఒక ఇంటర్వ్యూలో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 30-35 ఏళ్లుగా బీహార్‌ను కార్మికుల రాష్ట్రంగా మార్చారు. బాలల వీపుపై బస్తాలు, యువత చేతిలో పని పరికరాలు.. ఇదే పరిస్థితి. ఇది నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన ఫలితం అని ప్రశాంత్ మండిపడ్డారు. బీహార్ ప్రజల జీవన ప్రమాణాలను పునరుద్ధరించాలంటే ఈ సాంప్రదాయ పార్టీలు తప్పాల్సిందేనన్నారు. ఇక రాహుల్ గాంధీపై కూడా ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు బీహార్‌లో స్థానం లేదు. రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయో అంచనా వేయడం కూడా కష్టం. లాలూ ఎన్ని సీట్లు ఇస్తే అంతే అని వ్యాఖ్యానించారు. పొత్తుల సాయం లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని రాహుల్‌కు సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే సింగిల్‌గా బరిలో దిగండి. ప్రజల మద్దతు ఉందా లేదా తేల్చుకుందాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాగే, ఆయన జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికీ, ఆర్జేడీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికీ సవాల్ విసిరారు. ఇది పార్టీలు మారే సమయం కాదు, ప్రజల జీవన స్థితిని మార్చే సమయం అని స్పష్టం చేశారు. ఇక ఈసారి ఎన్నికలు ఎప్పుడవుతాయన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభించింది. వచ్చే నెలలో ఎప్పుడు అయినా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అన్ని పార్టీలూ ప్రజల మద్దతు కోసం సిద్ధమవుతున్న వేళ, ప్రశాంత్ కిషోర్ విమర్శలు, సవాళ్లు రాజకీయం మరింత వేడెక్కించనున్నాయి.

Read Also: Tata Group: విమాన ప్రమాద బాధితులకు రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్