Bihar Man RTI Application : కేంద్రానికి విచిత్ర దరఖాస్తు చేసిన సమాచారహక్కు చట్ట కార్యకర్త

బీహార్(Bihar) రాష్ట్రానికి చెందిన సమాచార హక్కు చట్టం(RTI) కార్యకర్త కేంద్ర భూ విజ్ఞానశాఖ అధికారులకు విచిత్రమైన దరఖాస్తు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Bihar man files RTI Application and Ask god for reasons for less Rains news goes viral

Bihar man files RTI Application and Ask god for reasons for less Rains news goes viral

వర్షాకాలంలోనూ(Rainy Season) విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో విసిగిపోయిన బీహార్(Bihar) రాష్ట్రానికి చెందిన సమాచార హక్కు చట్టం(RTI) కార్యకర్త కేంద్ర భూ విజ్ఞానశాఖ అధికారులకు విచిత్రమైన దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల ప్రజలు ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, ఆర్టీఐ చట్టం ప్రకారం దానికి కారణమేంటో చెప్పాలని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. అవసరమైతే ఇందుకు కారణమేంటో దేవుడిని అడిగి తమకు సమాధానమివ్వాలని దరఖాస్తులో కోరారు. దేవుడిని(God) కూడా ఈ దరఖాస్తులో ప్రతివాదిగా చేర్చడం చర్చనీయాంశమైంది.

సమాచారహక్కు చట్టం కార్యకర్త చేసిన ఈ పని.. ఓ సినిమాను గుర్తుచేస్తుంది. అదే గోపాల గోపాల. ఆ సినిమాలో తనకు జరిగిన నష్టానికి Act of God అనే పాయింట్ ప్రకారం.. నష్టపరిహారం చెల్లించాలని హీరో కోర్టులో వాదిస్తాడు. కాకపోతే ఇక్కడ వాతావరణం గురించి దేవుడిని అడిగి చెప్పాలంటూ ప్రతివాదిగా చేర్చారు. వర్షాకాలం మొదలై చాలారోజులు గడిచిపోయినా ఇంతవరకూ బీహార్ పరిసర ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు కురవలేదు. సరైన వర్షపాతం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

దాంతో గౌరాబౌరామ్ జిల్లా మహౌర్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాజ్ కుమార్ ఝా వర్షాలు కురవకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇందుకు గల కారణమేంటో చెప్పాలని భూ విజ్ఞానశాఖకు దరఖాస్తు చేశారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ఇందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడాలని కూడా సలహా ఇచ్చారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

 

Also Read : TSRTC: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ రాఖీ లక్కీ డ్రా నగదు పురస్కారాలు

  Last Updated: 08 Sep 2023, 07:38 PM IST