6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

అప్పుడప్పుడు అనుకోకుండా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉంటాయి. అయితే ఎందుకు గల ప్రధాన కారణం

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 09:45 AM IST

అప్పుడప్పుడు అనుకోకుండా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉంటాయి. అయితే ఎందుకు గల ప్రధాన కారణం అవతలి వ్యక్తి అకౌంట్ నెంబర్ ని ఒకటి, రెండు నెంబర్లను తప్పు కొట్టడం. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మనం వేసే అమౌంట్ కూడా అనుకోకుండా నెంబర్ మిస్టేక్ వల్ల వేరే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పటికే ఇలా బ్యాంకు నెంబర్ మిస్టేక్ అయ్యి ఎందరో ఖాతాలలో డబ్బులు జమ అయిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది నిజాయితీగా ఉన్నవారు వారి ఖాతాల్లోకి జమ అయిన డబ్బును వెనక్కి తిరిగి ఇస్తూ ఉంటారు.

ఇంకొందరు మాత్రం వారి ఖాతాల్లోకి డబ్బు పడలేదు అని బుకాయిస్తూ ఉంటారు. తాజాగా బీహార్ కు చెందిన ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి ఎక్కువగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 6 వేల కోట్ల రూపాయలు జమ అయ్యింది. ఆ వ్యక్తి తన బ్యాంకు ఖాతా చూసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ లో వ్యక్తికి చెందిన డీమ్యాట్ అకౌంట్‌లో ఏకంగా రూ.6 వేల కోట్లు జమ అయ్యాయి. అయితే ఆ డబ్బు గురించి ఇప్పటివరకు ఎవ్వరూ సంప్రదించకపోవడం గమనార్హం. అయితే డబ్బులు తన ఖాతాలో జమ అయిన సదరు వ్యక్తి కూడా ఎవరైనా తనని అడుగుతారేమో అని అతను కూడా ఎదురు చూడగా ఎవరు కూడా ఆ డబ్బు గురించి ఆడగక పోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.

లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమాన్ కుమార్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం తన డీ మ్యాట్ అకౌంట్‌ను చెక్ చేసుకునీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని ఖాతాలో ఏకంగా రూ.6,833.42 కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆ డబ్బులు అతని ఖాతాలోనే ఉన్నాయి. అయితే అంత పెద్ద మొత్తంలో డబ్బు పొరపాటున ఇతని అకౌంట్‌లోకి డబ్బు జమ అయి ఉంటే ఈ పాటికే ఎవరో ఒకరు ఫిర్యాదు చేసి ఉండేవారు. కానీ ఇప్పటివరకు ఎవరూ ఆ డబ్బు గురించి ఎవరు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.కాగా పూర్తి సమాచారం సేకరించే పనిలో స్థానిక పోలీసులు నిమగ్నమయ్యారు.