Site icon HashtagU Telugu

8 MLAs Missing : ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు జంప్.. బిహార్ అసెంబ్లీలో టెన్షన్.. స్పీకర్‌పై వేటు

7 Mlas Missing

7 Mlas Missing

8 MLAs Missing : బిహార్ అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ రాజకీయ హోరును సంతరించుకుంది. విశ్వాస పరీక్షకు ముందు అసెంబ్లీలో  కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిని ఆ పదవి నుంచి తప్పించాలనే తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మెజారిటీ ఓట్లు పడటంతో అవధ్ బిహారీ చౌదరిపై వేటు పడింది. ఆ వెంటనే ఆయన స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి వెళ్లిపోయారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ కొత్త స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన విశ్వాస పరీక్ష కాసేపట్లో జరగనున్న తరుణంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు  కనిపించకపోవడం(8 MLAs Missing) రాజకీయ కలకలం రేపింది. మిస్సయిన ఎమ్మెల్యేలలో బీజేపీకి చెందిన ముగ్గురు, ఆర్జేడీకి చెందిన ఇద్దరు, జేడీయూకు చెందిన ముగ్గురు ఉన్నారు. సభకు హాజరుకాని బీజేపీ ఎమ్మెల్యేలలో భాగీరథి దేవి, రష్మీ వర్మ, మిశ్రీ లాల్ యాదవ్ ఉండటం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలం దేవి సహా మరొకరు షాకిచ్చారు. వారు ముగ్గురు జేడీయూ  వైపున కూర్చున్నారు. స్పీకర్‌ అవధ్ బిహారీ చౌదరిని పదవీచ్యుతుడిగా  చేసేందుకు జరిగిన ఓటింగ్‌లోనూ వీరు క్రాస్ ఓటింగ్ చేశారు. ఈ ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు వెళ్లి అధికార పక్షం సీట్లలో కూర్చోవడంతో ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వెంటనే వచ్చి ప్రతిపక్షం సీట్లలో కూర్చోవాలంటూ అరిచారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది.

Also Read : Musk Vs Parag : 21 ఏళ్ల కుర్రాడి వల్లే ట్విట్టర్‌ను మస్క్ కొన్నాడట.. ఎందుకో తెలుసా ?

నితీశ్ నెగ్గడం కన్ఫార్మ్ 

బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 128 మంది ఎమ్మెల్యేలు బీజేపీ-జేడీ(యూ) కూటమి వైపు ఉన్నారు. ప్రతిపక్ష కూటమి వైపు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాసేపట్లో జరిగే విశ్వాస పరీక్షలో నితీశ్ కుమార్ సర్కారు గట్టెక్కాలంటే 122 మంది సభ్యుల బలం ఉందని నిరూపించుకోవాలి. ఈ సవాల్‌ను ఈజీగానే నితీశ్ అధిగమించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యేలు నితీశ్ వెంట ఉన్నారు. కొత్తగా ఇవాళ ఆర్జేడీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు నితీశ్ వైపు చేరిపోయారు. దీంతో బిహార్ అసెంబ్లీలో ఎన్డీఏ బలం 131కి పెరిగింది. మరోవైపు ఆర్జేడీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదని తెలుస్తోంది. ఏ లెక్కన చూసుకున్నా ఇవాళ విశ్వాస పరీక్షలో నితీశ్ సారథ్యంలోని బిహార్ ఎన్డీఏ  కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది.

Exit mobile version