Tejashwi Yadhav : నితిన్ గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తిన తేజస్వీ యాదవ్..!!

  • Written By:
  • Publish Date - November 14, 2022 / 09:37 PM IST

బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్…కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీని తెగపొగిడేశాడు. కేంద్రంలో నితిన్ గడ్కరీ లాంటి మంత్రులు ఇంకా ఉంటే…మిగతా శాఖల్లో కూడా పనులు పెండింగ్ లో ఉండవన్నారు. నితిన్ గడ్కరీ పార్టీ కోసం కాదు…డెవలప్ మెంట్ కోసం పనిచేస్తున్నారంటూ బహిరంగంగా ప్రశంసించారు. గడ్కరీ ప్రగతిశీల, సానుకూల మంత్రి అన్నారు. బీహార్ లోని రోహతాస్ లోని నేషనల్ హైవే ప్రాజెక్టు శంకుస్తాపన కార్యక్రమంలో ప్రసంగించిన తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నితిన్ గడ్కరీతో తనకు మంచి సంబంధం ఉందన్న తేజస్వీ యాదవ్…రాష్ట్రం , దేశం అభివ్రుద్ధిపై ఎక్కువ ద్రుష్టిసారిస్తారన్నారు. తొలిసారి ఉపముఖ్యమంత్రి అయిన నాకు గడ్కరీ మద్దతు ఎప్పుడు ఉందన్నారు. ఏ పనిమీద అయినా తన దగ్గరకు వెళ్తే వెంటనే ఆ పనిని చేసేవారన్నారు. మా భావాజలం ఏదైనా సరే గడ్కరీ నుంచి నేర్చుకోవాలనే కోరిక మాకు ఉంది. నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటాం. అది బీహార్ ప్రజలైనా..దేశ ప్రజలైనా. ఏ ప్రభుత్వం రావాలన్నా మంత్రి అయినా తన పని తాను చేసుకుపోవడమే నా కోరిక. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ మనందరం కలిసి పనిచేయాలి అని అన్నారు తేజస్వీ యాదవ్.

 

రోహతాస్ సోన్ నదిపై పాండుక సమీపంలో రూ. 210కోట్లు 1.5 కిలోమీటర్ల పొడవున 2 లేన్ ఆర్సీసీ వంతెనను నిర్మిస్తున్నారు. ఆ వంతెనకు ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ వంతెన నిర్మాణంతో ఎన్ హెచ్ 19, ఎన్ హెచ్ 39నేరుగా అనుసంధానం అవుతుంది. దీంతో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.