Site icon HashtagU Telugu

Tejashwi Yadav : తండ్రైన బీహార డిప్యూటీ సీఎం..ఫొటో షేర్ చేసిన తేజస్వీ యాదవ్

Tejshwi

Tejshwi

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తండ్రిగా ప్రమోషన్ కొట్టేశారు. ఆయన భార్య రాజశ్రీ యాదవ్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని స్వయంగా తేజస్వి యాదవ్ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమార్తెను చేతులో ఎత్తుకున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందని..దేవుడు ఆనందాన్ని కుమార్తె రూపంలో బహుమతిగా పంపాడంటూ రాసుకొచ్చారు. తేజస్వి యాదవ్ తన కూతురిని చేతిలో ఎత్తుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. మా ముద్దుల కూతురు ఇంటికి వచ్చిందని మేనత్త మిసా భారతి పోస్టు చేసింది.

తేజస్వి తండ్రి కావడంతోపాటు ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి కూడా తొలిసారిగా తాతలు అయ్యారు. ఇంతకుముందు, లాలూ-రబ్రీలను వారి ఏడుగురు కుమార్తెల పిల్లలకు తల్లితండ్రులుగా పిలిచేవారు. ఇప్పుడు మనవరాలికి తాతలు కూడా అయ్యారు. కొన్ని రోజుల క్రితం తేజస్వి యాదవ్ తండ్రి అయ్యాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌లో ప్రజలు లాలూ కుటుంబాన్ని అభినందించారు. అప్పటికే తేజస్వికి ఆడపిల్ల పుట్టిందంటూ వైరల్ గా మారింది. అయితే, లాలూ కుటుంబం రూమర్స్ గా కొట్టిపారేశారు. కానీ ఇఫ్పుడు స్వయంగా తేజస్వీ యాదవ్ తండ్రైనట్లు తెలిపారు.

Exit mobile version