Site icon HashtagU Telugu

Nitish Kumar :స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ప్రకటన..!! యువతకు 10లక్షల ఉద్యోగాలు..!!

Nitish Imresizer

Nitish Imresizer

నిన్నటి వరకు బీహార్ లో రాజకీయ ప్రత్యర్థలు ఎవరంటే జేడీయు అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ అనే సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఇప్పుడు వారిద్దరూ ఒక్కటయ్యారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ సీఎంగా, తేజస్వీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన తేజస్వి యాదవ్ అన్నట్లుగానే తేజస్వీ యాదవ్ ఆకాంక్షను నెరవేర్చేలా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ హామీ ఇచ్చారు. తమ సంకీర్ణ ప్రభుత్వ ఆకాంక్ష మేరకు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు మరో పది లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగుల కల్పన కోసం తాము పెద్దెత్తున క్రుషి చేస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి ప్రకటనపై తేజస్వీ స్పందించారు. ముఖ్యమంత్రి అతిపెద్ద ప్రకటన చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి హామీని నెరవేర్చేందుకు రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తామని తేజస్వీ తెలిపారు.