Site icon HashtagU Telugu

Bihar CM Nitish Kumar: పాట్నాలో నితీష్ కు ఘన స్వాగతం

Bihar Cm Nitish Kumar

Bihar Cm Nitish Kumar

Bihar CM Nitish Kumar: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడంతో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో కీలక పాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు సోమవారం పాట్నాకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పాట్నా విమానాశ్రయం వెలుపల జేడీయూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిలబడి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రి రాక గురించి సమాచారం అందుకున్న జేడీయూ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అప్పటికే పాట్నా విమానాశ్రయం వెలుపల గుమిగూడి తమ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోసం వేచి ఉన్నారు. నితీష్ కుమార్ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే జేడీయూ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి అనుకూలంగా నినాదాలు చేశారు. విమానాశ్రయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి నితీష్ నివాసానికి బయలుదేరారు. ఈ సమయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు దారిలో కార్యకర్తలు భారీ సంఖ్యలో నిల్చున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ సత్తా చాటింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాల్లో విజయం సాధించింది. బీహార్‌లో ఎన్డీయే 30 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో జేడీయూ ప్రాధాన్యత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జేడీయూ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. దేశా రాజకీయాల్లో తమదే ఆధిపత్యం అంటూ నినదిస్తున్నారు. ఇటీవల పాట్నా రోడ్డుపై ‘పులి ఇంకా బతికే ఉంది’ అని రాసి ఉన్న పోస్టర్‌ వైరల్ గా మారింది. అందులో నితీష్‌కుమార్‌ చిత్రంతో పాటు రెండు పులుల చిత్రాలు ఉన్నాయి. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి నితీష్ కుమార్ హాజరయ్యారు. మోదీ కేబినెట్‌లో ఇద్దరు జేడీయూ ఎంపీలు చేరారు.

Also Read: Sama Ram Mohan Reddy : బీజేపీ లోకి హరీశ్ రావు – కాంగ్రెస్ సంచలన ఆరోపణలు