Big Shock to Sharad Pawar : శరద్‌పవార్ కు ఈసీ భారీ షాక్ ..

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 09:10 PM IST

కేంద్ర ఎన్నికల సంఘం (EC) శరద్ పవార్‌ (Sharad Pawar)కి భారీ షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్‌దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. పార్టీ గుర్తును ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది. 6 నెలలుగా సాగిన, 10కి పైగా విచారణల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

అధినేత శరద్ పవార్‌ నుంచి ఎన్సీపీ పేరును, పార్టీ గుర్తును అజిత్ పవార్ వర్గానికి చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది. దాదాపు 10కి పర్యాయాలు విచారణ జరిపి, ఇరువర్గాల వాదనలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఎట్టకేలకు ఎన్సీపీ అంటే అజిత్ పవార్ అని ప్రకటించిన ఈసీ, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు ఊహించిన షాకిచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది అజిత్ పవార్, శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీని రెండుగా చీల్చారు. కీలకమైన నేతలు, మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గానికి మద్దతుగా నిలిచారు. మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వం ఎన్సీపీ కూడా చేరి ఎన్డీయే కూటమిలో మిత్రపక్షమైంది. అయితే, శరద్ పవార్ మాత్రం కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ ఇతర పార్టీలతో కూడిన ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు.

ఇరు వర్గాలు తమదే నిజమైన ఎన్సీపీ అని, ఎన్నికల గుర్తు కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. శాసనసభలో ఎక్కువ మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గంలోనే ఉన్నారు. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also : Gadala The Leader : నా మార్గం.. నా ఇష్టం.. ప్రజల కోసమే పాలిటిక్స్ : గడల