మార్చి మొదటి తేదీన వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ధరలు (LPG Prices) షాక్ ఇచ్చాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి. మార్చి నెల మొదటి రోజు గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది.
ఇప్పుడు ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రూ.1103గా మారింది. హోలీకి ముందు ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగాయి. అదే సమయంలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.350.50 పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ. 2119.50కి అందుబాటులో ఉంటుంది. కాగా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రూ.1103కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
Also Read: Xiaomi: షావోమీ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?
మన తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం 8 నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో ఈ రేటు రూ. 1155కు చేరింది. అలాగే ఏపీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో ఈ రేటు రూ. 1161కు చేరింది. దేశీయ వంట గ్యాస్ ధరలు స్థానిక పన్నుల కారణంగా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ఇంధన రిటైలర్లు ప్రతి నెల ప్రారంభంలో LPG సిలిండర్ల ధరలను సవరిస్తారు.