Bharat Jodo Yatra: రాహుల్ సభలో బిగ్ మిస్టెక్…జనగణమన బదులుగా…ఆ దేశ జాతీయ గీతం ఆలాపన..!!

  • Written By:
  • Updated On - November 18, 2022 / 07:51 AM IST

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా వాషిమ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. తర్వాత జాతీయ గీతం వస్తుందని రాహుల్ ప్రకటించాడు. అంతా లేచి నిలబడి ఉన్నారు. అయితే పొరపాటున మైక్ లో భారతదేశ జాతీయ గీతం జనగణమన కాకుండా నేపాల్ జాతీయ గీతం రావడం మొదలైంది. దీంతో వేదికపై ఉన్న రాహుల్ విస్తుపోయారు. కాంగ్రెస్ నేతలవైపు సీరియస్ గా చూశారు. దీంతో వెంటనే కాంగ్రెస్ నేతలు ఆ పాటను ఆపేశారు. తర్వాత మన జాతీయ గీతం ప్రారంభమైంది.

అయితే కనీసం రెండు లైన్ల జాతీయ పూర్తికాకుండానే నేతలు కార్యకర్తలు, జైహింద్ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే మైక్ ను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేతలకు జాతీయ గీతం కూడా తెలియదా అంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అంతేకాదు రాహుల్ గాంధీపై సెటైర్లు విసరడం ప్రారంభించింది. మిస్టర్ రాహుల్…వాటీజ్ దిస్ అంటూ ఓ బీజేపీ నేత…పప్పు కా కామెడీ సర్కస్ అంటూ మరో నేత ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే పొరపాటుగా జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది.