Big Loan Deal: రిలయన్స్ కు రూ.24,600 కోట్ల లోన్ ఇచ్చేందుకు 10 బ్యాంకులు రెడీ

భారతదేశంలోనే అతిపెద్ద లోన్ డీల్ జరిగేందుకు వేదిక సిద్ధం అవుతోంది. అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ , రిలయన్స్ జియో

భారతదేశంలోనే అతిపెద్ద లోన్ డీల్ (Loan Deal) జరిగేందుకు వేదిక సిద్ధం అవుతోంది. అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు మెగా సిండికేట్ లోన్ ఇచ్చేందుకు కనీసం 10 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ లోన్ (Loan) ఎంతో తెలుసా? రూ.24,600 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మూలధన వ్యయం, జియో 5G విస్తరణకు నిధులు సమ కూర్చడానికి ఈ రుణం అందించబడుతుంది.

ఆసియా బ్యాంకులు కూడా..

లోన్ ఇచ్చేందుకు మొత్తం 10 బ్యాంకులు రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చర్చలు జరుపుతున్నాయి. ఈ డీల్ జరిగితే అది అతిపెద్ద సిండికేట్ టర్మ్ లోన్ అవుతుంది.  రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సిండికేషన్ పూర్తి కాగానే.. కనీసం డజను బ్యాంకులు ఈ రుణ మొత్తాన్ని (రూ.24,600 కోట్లు) రిలయన్స్ కు ఇస్తాయి.  అన్ని బ్యాంకులు రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఈ రుణం ఇవ్వడానికి సంబంధించిన లాంఛనాలను మాత్రమే పూర్తి చేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సిండికేషన్‌లో చేరేందుకు బ్యాంకుల మధ్య గట్టి పోటీ ఉందని అంటున్నారు.ఇప్పటి వరకు 15 బ్యాంకులు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బిఎన్‌పి పారిబాస్, హెచ్‌ఎస్‌బిసి, స్టాండర్డ్ చార్టర్డ్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు డాలర్ కరెన్సీలో రుణాలు ఇచ్చేందుకు రిలయన్స్ తో సైన్ అప్ చేశాయి. ఇప్పుడు మరో 10 బ్యాంకులు బార్క్లేస్, JP మోర్గాన్, ING బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ తైవాన్ , సుమిటోమో మిట్సుయ్ ట్రస్ట్ బ్యాంక్‌లు కూడా ఈ లిస్టులో చేరాయి. ఐదేళ్ల బాహ్య వాణిజ్య రుణాల కోసం తుది సిండికేషన్‌లో మరిన్ని ఆసియా బ్యాంకులు కూడా చేరుతాయని వారు తెలిపారు.

ఫారిన్ బ్యాంక్స్ క్యూ..

జపాన్ బ్యాంకులు Mizuho Bank, MUFG,  Sumitomo Mitsui అనేవి రిలయన్స్ కు అవసరమైన యెన్ భాగానికి నిధులు సమకూరుస్తున్న బ్యాంకులలో ఉన్నాయి . ఇవి ఇచ్చే లోన్స్ $300 మిలియన్ నుంచి $400 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. మారిషస్‌కు చెందిన AFRAsia, తైవాన్ యొక్క ఫస్ట్ కమర్షియల్ మరియు Esun కమర్షియల్ మరియు కొరియా యొక్క KEB హనాతో ఒప్పందంలో చేరడానికి ఇతర ఆసియా బ్యాంకులు కూడా చివరి సిండికేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయి. RIL కోసం ఇచ్చే లోన్స్ యొక్క సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేట్ (SOFR) 150 బేసిస్ పాయింట్లు మరియు జియోకి 158 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని అంటున్నారు.

Also Read:  HUID: ఏప్రిల్ 1 విడుదల.. HUID హాల్ మార్క్ గోల్డ్ మాత్రమే విక్రయిస్తారు.. మీరు కొన్న జ్యువెలరీ సంగతేంటి?