NIA Raids : 50 చోట్ల ఎన్ఐఏ రైడ్స్.. ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆర్థికమూలాల అంతమే టార్గెట్

NIA Raids :  ఖలిస్థానీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న సంస్థలపై భారత దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 09:13 AM IST

NIA Raids :  ఖలిస్థానీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న సంస్థలపై భారత దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ఈక్రమంలోనే ఇవాళ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలోని దాదాపు 50 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మెరుపు రైడ్స్ చేసింది. ఖలిస్థానీ తీవ్రవాదులతో సంబంధం ఉన్న హవాలా ఆపరేటర్లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్‌లను అరెస్టు చేసే లక్ష్యంతో ఈ సోదాలు చేశారు. పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13 చోట్ల, హర్యానాలో 4 చోట్ల, ఉత్తరాఖండ్‌లో 2 చోట్ల, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కో చోట సోదాలు నిర్వహించారు. ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్లను విచారించగా తెలిసిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ ఈ రైడ్స్ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.

Also read : Protests Of IT Employees: ఐటీ ఉద్యోగుల నిరసనలపై కేటీఆర్ నిషేధం ఎందుకు..?

ఖలిస్థానీ ఉగ్ర సంస్థలకు సానుభూతిపరులుగా ఉన్న గ్యాంగ్ లు డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల స్మగ్లింగ్ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయని, వాటిని కెనడా సహా పలు దేశాల్లో ఉన్న ఉగ్రమూకలకు అందిస్తున్నాయని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. తాజాగా NIA దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.  ఖలిస్థానీ ఉగ్ర సంస్థలకు భారత్ నుంచి నిధులు అందకుండా అడ్డుకట్ట వేయాలనే నిర్ణయానికి భారత సర్కారు వచ్చింది. అందుకే ఈ సోదాలు (NIA Raids) నిర్వహిస్తోంది.