Attempts Suicide: భోపాల్‌లో విషాధ ఘటన.. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విషాధ ఘటన జరిగింది. బుధవారం రాజధానిలోని బైరాగఢ్ కలాన్‌లో ఓ కాంట్రాక్టర్ తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యకు (Attempts Suicide) యత్నించాడు. అందరినీ హమీదియా ఆసుపత్రిలో చేర్పించారు.

  • Written By:
  • Publish Date - January 13, 2023 / 08:30 AM IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విషాధ ఘటన జరిగింది. బుధవారం రాజధానిలోని బైరాగఢ్ కలాన్‌లో ఓ కాంట్రాక్టర్ తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యకు (Attempts Suicide) యత్నించాడు. అందరినీ హమీదియా ఆసుపత్రిలో చేర్పించారు. కాంట్రాక్టర్‌తో పాటు అతని భార్య, ముగ్గురు పిల్లలకు చికిత్స కొనసాగుతోంది. అయితే చిన్న కుమార్తె పూర్వ (8 ఏళ్లు) చికిత్స పొందుతూ మృతి చెందింది.

అప్పుల బాధతో కాంట్రాక్టర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు యత్నించారు. ఖజూరి ప్రాంతంలో ఉండే కిషోర్ జాతవ్ ఓ కాంట్రాక్టర్. ఆర్థిక సమస్యలు పెరగడంతో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. కిషోర్‌తో పాటు అతడి భార్య సీత (35) నలుగురు పిల్లలు విషం కలిపిన పాలు తాగేశారు. అయితే కుమార్తె పూర్వ (8) బుధవారం చనిపోయింది. మిగిలిన పిల్లలు కంచన్ (15), అభయ్ (12), అన్ను (10) పరిస్థితి విషమంగా ఉంది. దంపతులు, వారి ముగ్గురు పెద్ద పిల్లలు హమీడియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దంపతులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

Also Read: Bomb in Plane: విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని ఖజూరి ప్రాంతంలో నివాసం ఉంటున్న కిషోర్ జాతవ్ (40) వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి తన భార్య సీత (35)తో కలిసి పాలలో విషం కలిపి నలుగురు మైనర్ పిల్లలకు తాగించాడు. వారి చిన్న బిడ్డ పూర్వ (8) బుధవారం రాత్రి చికిత్స సమయంలో మరణించగా.. మిగిలిన పిల్లలు కంచన్ (15), అభయ్ (12), అన్ను (10) గురువారం రాత్రి నాటికి హమీడియా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. జాతవ్, అతని భార్య మంగళవారం-బుధవారం మధ్య రాత్రి వారి నలుగురు పిల్లలకు పాలలో విషం కలిపి తాపించారని బైరాగఢ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ యాంటీమా సమాధియా తెలిపారు.

అయితే.. చికిత్స తర్వాత బుధవారం స్పృహలోకి వచ్చిన జాతవ్ తాను అప్పుల బాధలో ఉన్నానని, దాని కారణంగా తాను ఈ చర్యకు తీసుకోవలసి వచ్చిందని పోలీసులకు చెప్పాడు. అయితే అతను వివిధ వ్యక్తుల నుండి ఎంత మొత్తంలో రుణాలు పొందాడు అనే విషయాన్ని వివరించలేదు. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా గురువారం మీడియాకు తెలిపారు.