హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ సింగ్ ఫై ఎట్టకేలకు కేసు నమోదైంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
భోలే బాబాకు సంబంధించిన రూ.100కోట్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. బాబా కు 24 విలాసవంతమైన ఆశ్రమాలున్నాయని దర్యాప్తులో తేలింది. ప్రత్యేక ప్రైవేటు సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉండటం గమనార్హం. అయితే ఎలాంటి డొనేషన్స్ తీసుకోనని చెబుతున్న భోలే బాబా ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారనేది ఆసక్తికరంగా మారింది.
భోలే బాబా (Bhole Baba)..ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. నాల్గు రోజుల క్రితం భోలే బాబా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు..అసలు ఎవరు పట్టించుకోలేదు..కానీ ఎప్పుడైతే..హత్రాస్‌లో (Hathras Stampede) జరిగిన తొక్కిసలాట 121 మంది వరకు చనిపోవడం తో అంత ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ భోలే బాబా వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చదవు పూర్తి చేసుకున్నాక.. 18 సంవత్సరాల పాటు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసాడు. ఆ తర్వాత వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్) తీసుకుని, ఆధ్యాత్మిక బాట పట్టాడు.
We’re now on WhatsApp. Click to Join.
పోలీసు శాఖలో పని చేసే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల కేసులో నమోదు కావడం తో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత నారాయణ్ సాకార్ విశ్వహరి బాబాగా పేరు మార్చుకొని , తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరించి జనాలను ఆకర్షించడం మొదలుపెట్టారు. అలా గత కొన్ని ఏళ్లుగా ఆశ్రమం నడిపిస్తూ దాదాపు రూ.100 కోట్లు వెనకేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అంత షాక్ అవుతున్నారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఆశ్రమాలు నడిపిస్తున్నట్లు బయటపడింది. యూపీలోని మెయిన్‌పురిలోని హరి నగర్ అని పిలిచే ఆశ్రమంలో భోలే బాబా నివాసం ఉంటారు.
ఈ హరి నగర్ 13 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం దాదాపు 6 లగ్జరీ రూమ్స్ ఉన్నాయి. ఇక హరి నగర్ ఆశ్రమంలోకి వెళ్తుండగా ఆ ఆశ్రమానికి విరాళం ఇచ్చిన 200 మంది పేర్లు రాసి ఉంటాయి. అందులే రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల పేర్లు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఇటావాలో మరో కొత్త ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు.
Read Also : Prostitution : హైదరాబాద్ లో రాత్రి 9 దాటితే చాలు రోడ్డెక్కుతున్న వేశ్యలు