Site icon HashtagU Telugu

Vande Bharat Trains: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చేతికి వందేభారత్‌ రైళ్ల ఆర్డర్.. వచ్చే ఆరేళ్లలో 80 రైళ్లు..!

Vande Sadharan

Vande Metro

దేశంలోని మొట్టమొదటి సెమీ హైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులలో ఉత్సుకతతో ఉంది. ఢిల్లీ-బనారస్ మధ్య మొదలైన వందే భారత్ ఇప్పుడు దాదాపు డజను రూట్లలో నడుస్తోంది. మరోవైపు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ మార్పులకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు వందే భారత్‌లో కేవలం సిట్టింగ్ కోచ్‌ను మాత్రమే చేర్చారు. అయితే త్వరలో వందే భారత్‌లో స్లీపర్ కోచ్‌లను కూడా చూడవచ్చు.

ప్రభుత్వ రంగ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నేతృత్వంలోని కన్సార్టియం 80 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్ల కాంట్రాక్టును పొందింది. కాంట్రాక్టు మొత్తం రూ.9,600 కోట్లకు పైగా ఉంది. స్లీపర్‌ క్లాస్‌ వందేభారత్‌ ట్రైన్‌లను నడపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తుండటంతో కేంద్రం కొత్తరైళ్లకు ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ క్లాస్‌లు కలిగిన వందేభారత్‌ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి పొడవైన మార్గాలలో వీటిని నడపవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న అన్ని వందే భారత్ రైళ్లలో చైర్ కార్, స్పెషల్ చైర్ కార్ క్లాసులు మాత్రమే ఉన్నాయి.

Also Read: Bihar : ఆర్జేడీ అధినేత లాలూతో బీహార్ సీఎం నితీష్ భేటీ.. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌లపై చ‌ర్చ‌..?

80 వందే భారత్ రైళ్లకు ఒప్పందం

భారతీయ రైల్వేల నుంచి 80 వందే భారత్ రైళ్ల కాంట్రాక్టును బీహెచ్‌ఈఎల్ నేతృత్వంలోని కన్సార్టియం చేజిక్కించుకున్నట్లు కంపెనీ మంగళవారం స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. దీని కింద పన్నులు, సుంకాలు మినహా ఒక్కో రైలు సరఫరా విలువ రూ.120 కోట్లు. స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 35 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. BHEL 72 నెలల్లో 80 రైళ్లను సరఫరా చేస్తుంది.

Exit mobile version