Site icon HashtagU Telugu

Bhatti Vikramarka : రాహుల్ గాంధీతో భట్టి విక్రమార్క సమావేశం

Bhatti Rahul

Bhatti Rahul

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )తో సమావేశమయ్యారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడిగా భట్టివిక్రమార్క బాధ్యత చేపట్టడం తో.. ప్రస్తుతం ఆయన రాంచీ(Ranchi)లో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు రాంచీకి రాహుల్ గాంధీ రావడం తో..భట్టి అయనకు స్వాగతం పలికి శాలువా కప్పారు. ఇండియా కూటమిలో భాగమైన.. కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ పక్షాలతో చర్చలు, సమన్వయ సమావేశం నిర్వహించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశిస్తున్న స్థానాల పై కీలక చర్చలు ఈ సమావేశంలో జరిపారు.

ఇక ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారం(Jharkhand election campaign)లో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. మోడీ సర్కార్ ఎన్నికల కమిషన్‌, సీబీఐ, ఈడీ, అదాయ పన్ను శాఖ సహా, ప్రభుత్వ అధికారులను (బ్యూరోక్రసీ) నియంత్రిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని, దానిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన మోదీ సర్కార్‌, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మాత్రం ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆమె ఒక ఆదివాసి కావడమే’ అని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ ‘ఆదివాసీ’లను కొత్తగా ‘వనవాసీ’లు అంటోంది. “ఆదివాసి అంటే మొదటి నుంచి ఉన్నవారు అని అర్థం. వనవాసి అంటే అటవీ ప్రాంతంలో జీవించేవారు అని అర్థం. ఈ విధంగా ఎంతో ఘనత కలిగిన ఆదివాసీల వారసత్వం, చరిత్ర, సంప్రదాయాలు, వైద్య విధానాలను ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ చెప్పుకొచ్చారు.

Read Also : Rahul Sipligunj : రజనీకాంత్ ను బాధపెట్టిన రాహుల్ సిప్లిగంజ్