Bharat Rice : రేపటి నుంచి మార్కెట్‌లోకి భారత్ రైస్..ధర చాల తక్కువ

ఓ పక్క బడ్జెట్ (Budget) జరుగుతుండగానే..కేంద్రం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ (Good News) తెలిపింది. రేపటి నుండి మార్కెట్ లోకి భారత్ రైస్ (Bharat Rice) ను అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. దీని ధర కిలో 29 రూపాయల చొప్పున విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో రైస్ ధర […]

Published By: HashtagU Telugu Desk
Bharat Rice Price

Bharat Rice Price

ఓ పక్క బడ్జెట్ (Budget) జరుగుతుండగానే..కేంద్రం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ (Good News) తెలిపింది. రేపటి నుండి మార్కెట్ లోకి భారత్ రైస్ (Bharat Rice) ను అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. దీని ధర కిలో 29 రూపాయల చొప్పున విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ప్రస్తుతం మార్కెట్ లో రైస్ ధర ఎంతగా పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు 25 కేజీల సోనామసూరి బియ్యం బస్తా రూ.600 ఉండేది..ఇప్పుడు అమాంతం రూ. 1800 నుండి రూ.2000 వరకు వెళ్ళింది. ఇదెక్కటే కాదు పలురకాల రైస్ అన్నీకూడా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో సామాన్య ప్రజలు మార్కెట్ లో లభించే రైస్ కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు మొదలుపెట్టింది. కిలో రూ. 29లకే భార‌త్ రైస్‌ను (Bharat Rice) ప్రవేశ పెట్టాలని డిసైడ్ అయ్యింది. గోధుమ పిండి, ప‌ప్పుధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్ పేరిట డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు కేంద్రం ఇప్ప‌టికే అందిస్తున్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్ర‌మంలో భార‌త్ రైస్‌ను కూడా డిస్కౌంట్ ధ‌ర‌కు నాఫెడ్‌, ఎన్సీసీఎఫ్‌, కేంద్ర‌య భండార్ అవుట్‌లెట్స్‌, మొబైల్ వ్యాన్స్ వంటి ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్ర‌భుత్వం చూస్తుంది. బియ్యం ధ‌ర‌లు స‌గ‌టున కిలోకు రూ. 44కు చేర‌డంతో ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డి దిశ‌గా కేంద్రం భార‌త్ రైస్ పంపిణీకి చ‌ర్య‌లు చేప‌డుతోంది.

ఇక ఇప్ప‌టికే ప్ర‌భుత్వం భార‌త్ ఆటా పేరిట కిలో రూ. 27.50కి, శ‌న‌గ పప్పును రూ. 60కి అందిస్తోంది. ఈ ఉత్ప‌త్తుల‌ను ఏకంగా 2000కుపైగా రిటైల్ పాయింట్స్‌లో విక్ర‌యిస్తున్నారు. భార‌త్ రైస్‌ను కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తూ ధ‌ర‌ల స్ధిరీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని కేంద్రం భావిస్తోంది. రేపటి నుంచి మార్కెట్ లోకి వస్తున్న భారత్ రైస్ ను ఎక్కువ ధరకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Read Also : TSRTC బస్సుల్లో మగవారికి మంచి రోజులు వచ్చాయి..

  Last Updated: 01 Feb 2024, 01:12 PM IST